Telangana Maldives: తెలంగాణ నుండి మాల్దీవులకు వెళుతున్నారా? అయితే మీ డబ్బులు మీరు వృథాగా ఖర్చు చేసినట్లే. ఎందుకంటే.. అంతకు మించిన బెస్ట్ ప్లేస్.. మన రాష్ట్రంలోనే ఉందన్న విషయాన్ని ముందు మీరు గ్రహిస్తే చాలు.. ఔను కదా అనే ఫీలింగ్ మీకు అనిపించకమానదు. ఇంతకు అసలు విషయం తెలుసుకోవాలంటే.. ఈ కథనం తప్పక చదవండి.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల అనేది ఒక చిన్న గ్రామమే కానీ, అక్కడికి వెళ్లగానే చిన్న గ్రామం.. ఓ అద్భుతం అనిపించకమానదు. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం ఓ ద్వీపమేనని చెప్పవచ్చు. బ్యాక్‌వాటర్స్, పొలాలు కలిసిపోయిన వాతావరణం అన్నీ కలగలసి తెలంగాణ మాల్దీవులులా ఈ ప్రదేశం పిలువబడుతోంది. ఇక్కడికి ఒక్కసారి వెళ్లినవారెవ్వరూ మళ్ళీ మర్చిపోలేరు.. ఎందుకంటే ఇక్కడి ప్రకృతితో ప్రేమలో పడిపోవడం ఖాయం.
శివున్ని సందర్శిస్తూ.. ప్రకృతిని ఆస్వాదించే అవకాశం
ఇక్కడ ఉన్న లలితా సోమేశ్వర స్వామి ఆలయం, చాళుక్యుల కాలానికి చెందిన 7వ శతాబ్దపు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ఆలయం ఓ వైపు, నది ప్రవాహం మరోవైపు.. భక్తి, శాంతి, ప్రకృతి అన్నీ ఒక్కచోటే చూడాలంటే సోమశిలకు వెళ్ళాల్సిందే. శివుడికి అభిషేకం చేసిన తర్వాత, నది ఒడ్డున కూర్చొని మనసుకు విశ్రాంతినిచ్చే బెస్ట్ ఆప్షన్ ఇదే.
ఎక్కడికో ఎందుకు? ఇక్కడికి వెళ్లండి!
మీరు హిల్ స్టేషన్‌లు, కోస్టల్ ఏరియాలు వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్తారు. కానీ ఇక్కడికొస్తే.. భక్తి ఉంటుందీ, బోట్ రైడింగ్ ఉంటుంది, నీటి సోయగాలను కనులు హాయిగా చూడటానికి సిద్ధంగా ఉంటాయి. ఉదయం సూర్యోదయం సమయంలో తీసిన ఒక్క ఫోటోకే వేల లైక్స్ వచ్చేలా ఉంటుంది ఇక్కడి వాతావరణం.
ఇన్‌స్టా లవర్స్‌కు గోల్డ్ స్పాట్!
ఇక్కడి ప్రతి దిక్కు ఒక ఫోటో జోన్. నది మీద తెప్పపై నిలబడితే ఒక ఫోటో, ఆలయ ముఖద్వారంలో మరో స్నాప్, బ్యాక్‌వాటర్ పక్కన సెల్ఫీ.. అన్నీ కలిసి ఒక ట్రెండింగ్ కంటెంట్ ప్యాక్. మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే వెనుక కృష్ణా నది అలలే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వినిపిస్తాయి.
Also Read: Visakhapatnam Raipur Expressway: ఏపీకి మరో ఫోర్ లైన్.. విశాఖ నుండి జర్నీ చాలా ఈజీ బాస్!
ఫ్యామిలీ ట్రిప్, ఫ్రెండ్ ట్రిప్, సోల్ ట్రిప్..
సోమశిల అంటే పక్కనే ఉన్న అందమైన రోడ్లు, పచ్చని పంటచేలు, నదిలో పడవలు, ఆలయంలో మోగే గంటల శబ్దం.. ఇలా ఇక్కడికి మీరు వెళ్లిన ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోతుంది. కుటుంబంతో ఒక రోజు గడిపినా, ఫ్రెండ్స్‌తో ఫన్ ట్రిప్ వేసినా.. ఇది పర్ఫెక్ట్ స్పాట్.
బోట్ రైడింగ్, ప్రసాదం, ప్రకృతి.. అన్నీ ఒకేచోటే!
ఇక్కడికి వచ్చినవారు ముందుగా ఆలయం దర్శించుకుంటారు. తరువాత నది ఒడ్డున బోటింగ్ చేస్తారు. మళ్లీ చెట్ల నీడలతో ఉన్న మడమలలో కూర్చుని ప్రసాదం తింటారు. అంతే కాదు, స్థానికులు ఎంతో ప్రేమగా ఆతిథ్యం అందిస్తారు. ఇది ట్రిప్‌కి కావాల్సిన హ్యుమన్ టచ్ అని చెప్పవచ్చు.
ఇంకా ఆలస్యం ఎందుకు?
హైదరాబాద్ నుంచి కేవలం 3 నుండి 4 గంటల్లో వెళ్ళొచ్చు. ట్రాన్స్‌పోర్ట్ సులభంగా లభిస్తుంది. మార్గం పూర్తిగా బాగుంది. మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి Somasila అని టైప్ చేయండి.. ఈ ప్లేస్ కు వెళ్లిన వెంటనే.. మీరు మాల్దీవ్స్‌కి వచ్చినట్టే ఫీలవుతారు. తెలంగాణలో ఇంత అందమైన, ఇంత శాంతమైన, ఇంత ఫోటోజెనిక్ ప్రదేశం ఉందని తెలియకుండా ఉండిపోతే మీరు చాలా మిస్ అవుతారు. సోమశిలను ఒకసారి చూస్తే.. మనసుతో చూసినట్టు ఉంటుంది. దీన్ని చూసినవారు ప్రేమించకుండా ఉండలేరు. మాల్దీవులకు వెళ్లే బడ్జెట్ లేకపోయినా.. సోమశిల మాత్రం మీతో ప్రేమించబడడం ఖాయం.