E-Paper
Advertisement

OTT Movie : చిన్న పిల్లలను అమాంతం మింగేసే బూచోడు… గుండె గల్లంతయ్యేలా చేసే హారర్ థ్రిల్లర్

OTT Movie : చిన్న పిల్లలను అమాంతం మింగేసే బూచోడు… గుండె గల్లంతయ్యేలా చేసే హారర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : డిఫరెంట్ స్టోరీలతో వచ్చే హారర్ సినిమాలు ప్రతీ భాషలో వస్తున్నాయి. ఇక ఈ జానర్లో వచ్చే సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ హారర్ సినిమాలో, ఒక వింత ఆకారం పిల్లలను భయపెడుతూ చంపుతుంటుంది. ఈ మూవీని చూస్తున్నంత సేపు గుండె ఆగినంత పని చేసే సీన్స్ చాలానే వస్తాయి. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాను చూడగలుగుతారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

డెర్రీ అనే పట్టణంలో చిన్న పిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. ఈ సమయంలో బిల్ డెన్‌బ్రో అనే బాలుడు, తన చిన్న తమ్ముడు జార్జీని కోల్పోతాడు. జార్జీ వర్షంలో కాగితం పడవతో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ పడవ ఒక సొరంగంలోకి వెళ్తుంది. లోపలికి వెళ్లిన పడవను తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, దెయ్యం రూపంలో ఉన్న పెన్నీవైజ్‌ అనే జీవి అతన్ని చంపేస్తుంది. తన తమ్ముడి మరణంతో కంగారుపడతాడు బిల్. తన తమ్ముడి మరణానికి కారణమైన పెన్నీవైజ్‌ను ఏదైనా చేయాలని అనుకుంటాడు. అతనితో కలిసి అతని స్నేహితులు రిచీ, ఎడ్డీ, స్టాన్, బెవర్లీ, బెన్, మైక్ వీళ్ళంతా కలసి ‘లూజర్స్ క్లబ్’ అనే బృందంగా ఏర్పడతారు. ఆ తరువాత వీరంతా డెర్రీ పట్టణంలో వివిధ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.పెన్నీవైజ్ వీళ్ళను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.

ఒకసారి లూజర్స్ క్లబ్ సభ్యులు పెన్నీవైజ్ ఒక సొరంగంలో ఉంటుందని గుర్తిస్తారు. ఈ క్రమంలో బెవర్లీని పెన్నీవైజ్ బంధిస్తుంది. ఆమెను రక్షించడానికి వీళ్ళంతా సొరంగంలోకి వెళతారు. అక్కడ వారు తమ భయాలను ఎదుర్కొంటూ, పెన్నీవైజ్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎంత భయపడితే, దాని బారిన పడి అంత త్వరగా చనిపోతారు. పెన్నీవైజ్ భయపెట్టే శక్తిని బిల్ ఎదుర్కొని బలహీనం చేస్తాడు. చివరికి వీళ్ళంతా పెన్నీవైజ్‌ను ఓడిస్తారా ? అది పూర్తిగా నాశనం అవుతుందా ? దాని బారిన పడి ఎంతమంది చనిపోతారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : చావు కూడా భయపడే రేంజ్ లో సైకో టార్చర్… భయంతో నరాలు కట్ అయ్యే హర్రర్ మూవీ మావా… చూస్తే వారం నిద్ర పట్టదు

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇట్’ (It). 2017 లో వచ్చిన ఈ మూవీకి ఆండీ ముషియెట్టి దర్శకత్వం వహించారు. స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా స్టోరీ డెర్రీ అనే పట్టణంలో 1988-89లో జరుగుతుంది. ఇందులో జాడెన్ మార్టెల్, సోఫియా లిల్లిస్ , ఫిన్ వోల్ఫ్‌హార్డ్, బిల్ స్కార్స్‌గార్డ్ వంటి నటులు నటించారు. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×