OTT Movie : బాలీవుడ్ నుంచి రకరకాల స్టోరీలతో రొమాంటిక్ సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో కలలో మాత్రమే ఒక జంట కలుసుకుంటూ ఉంటారు. గతంలో పరిచయం లేనప్పటికీ, ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. ఈ రొమాంటిక్ మూవీ చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
కెన్నీ అనే అబ్బాయి, దియా అనే అమ్మాయి నిజ జీవితంలో ఎప్పుడూ ఒకరిని ఒకరు చూసుకొని కూడా ఉండరు. కానీ ప్రతి రాత్రి వచ్చే కలలో కలుస్తుంటారు. ఈ కలలు నిజంగా జరుగుతున్నట్లు అనిపిస్తాయి. ఆ తరువాత ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ప్రారంభిస్తారు. వారు నిజంగా ఏదో తెలియని అనుభూతిలో ఉంటారు. కెన్నీ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఉంటాడు. ఇటీవల జరిగిన బ్రేకప్‌తో బాధపడుతుంటాడు. అతను తన కలలలో వచ్చిన అమ్మాయి ఎవరో కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతను తన మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక సైకియాట్రిస్ట్ ని కూడా సంప్రదిస్తాడు.
మరోవైపు దియా ఒక లిరికల్ రైటర్ ఉంటుంది. తన ప్రియుడు ఇషాంత్ ని ప్రేమించాలా, వదులుకోవాలా అనే సందేహంలో ఉంటుంది. ఆమె కూడా కెన్నీని తన కలలలో చూసి, ఈ కలలు నిజమైనవని భావిస్తుంది. వీరిద్దరూ తమ కలలలో కలిసిన కాఫీ షాప్ వంటి స్థలాలను ఆధారంగా చేసుకొని, ఒకరినొకరు నిజ జీవితంలో కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు వేర్వేరు నగరాల్లో ఉండటం వల్ల అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి వీళ్ళిద్దరూ నిజ జీవితంలో కలుస్తారా ? కలిశాక ఏం చేస్తారు ? ఈ కలలు నిజంగానే జరుగుతున్నాయా ? అనేది మాత్రం ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పెళ్ళికి పిల్ల కావాలంట … ఎవరూ దొరకట్లేదు … వయసేమో మీదకి వస్తోంది
జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో
ఈ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘స్వీట్ డ్రీమ్స్’ (Sweet Dreems). 2025 లో వచ్చిన ఈ మూవీకి విక్టర్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది 2014 లో వచ్చిన కెనడియన్ సినిమా ‘ఇన్ మై డ్రీమ్స్’ ఆధారంగా రూపొందింది. మిథిలా పాల్కర్, అమోల్ పరాశర్, మీయాంగ్ చాంగ్, సౌరసేని మైత్రా, ఫయే డి’సౌజా వంటి నటులు నటించారు. ఈ మూవీ 2025 జనవరి 24 నుంచి జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది.