Snake viral videos: ఈ ఊరికి వెళ్తే మీ ఒళ్లు జలధరించడం ఖాయం. ఇక్కడ జరిగే పండుగ చూస్తే కళ్లు మూయలేరు. మెడలో విషపు పాములతో ఊరేగే ప్రజలు, ఆ పాములను చేతుల్లో పట్టుకొని పిల్లలతో ఆడుకునే పెద్దల దృశ్యం చూస్తే, ఇది కలనా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. అసలు పాములతో ఈ సంప్రదాయం ఏంటి? ఈ వింత ఎక్కడ జరుగుతోందనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవండి.
విషపు పాములకు పూజలు..
దేశవ్యాప్తంగా నాగ పంచమిని పాముల పండుగగా జరుపుకుంటారు. పాములకు పాలు పోసి, నాగదేవతలకు పూజలు చేస్తారు. కానీ బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాలోని నవ్‌టోల్ అనే గ్రామంలో ఈ పండుగకు ఉండే ప్రాధాన్యం వేరే లెవల్లో ఉంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో విషపు పాములను నదిలో నుంచి బయటకు తీసుకువస్తారు. ఆ తర్వాత ఊరంతా పాములతో ఊరేగిస్తారు. ఇది చూస్తే ఎవరికైనా కాళ్లు, చేతులు గజగజ వణకాల్సిందే.
పాములతో ఆటలు.. భయం లేని భక్తి
ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే, పాములు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన మనం, ఈ ఊరిలో మాత్రం ప్రజలు వాటితో పిల్లల్లా ఆడుకుంటారు. చిన్న పిల్లలు కూడా ఆ పాములను చేతుల్లో పట్టుకొని నుదుటి మీద పెట్టుకుంటారు. పెద్దవారు వాటిని మెడలో వేసుకుని ఊరేగిస్తారు. మరో వాస్తవం ఏంటంటే, ఇక్కడ పాము కాటు వల్ల మరణాలు జరగడం చాలా అరుదు. ఎందుకంటే, గ్రామస్తులు చెబుతున్న కథ ప్రకారం, పాములు వారికి హాని చేయవని విశ్వాసం ఉంది.
300 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
ఈ పాముల పండుగ అంటే పది పదుల పండుగ కాదు. ఇది సుమారు 300 సంవత్సరాలుగా ఈ గ్రామంలో కొనసాగుతోంది. స్థానికంగా పరమానంద పండుగ అని పిలిచే ఈ నాగ పంచమి వేడుకకు దూరదూరాల నుంచి భక్తులు వస్తారు. ఒక్క రోజుకి ఇది పరిమితం కాదు, వారం రోజులపాటు వేడుకలు జరుగుతాయి. పాములను నదిలోని నీటి గుంతల నుంచి తీసుకురావడం, వాటికి పాలు పోయడం, అనంతరం ఊరేగింపు ఇవన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి.
నదిలో నుంచి పాములను ఎలా తీస్తారు?
వింతైన విషయమేంటంటే, గ్రామస్తులు నదిలోకి దిగి, చిన్న మట్టి గుంతల్లో దాగి ఉన్న పాములను తమ చేతులతో తీస్తారు. వీటిలో కొన్నికొన్ని కోబ్రాలు కూడా ఉంటాయి. కానీ గ్రామస్తులు వాటిని సున్నితంగా చేతిలోకి తీసుకుంటారు. అవి వీరిపై దాడి చేయవు. ఈ చర్యలు చూస్తే పాములపై వాళ్లకు ఉన్న మానసిక బంధం ఎంత బలంగా ఉందో తెలుస్తుంది.
ఆధ్యాత్మికతతో పాటు విశ్వాసం
ఈ ఉత్సవం కేవలం ధైర్యానికి ప్రతీక మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. నాగ దేవతను మహా శక్తిగా భావించే ఇక్కడి ప్రజలు, పాములను తాము మేనమామలుగా భావిస్తారు. పాములతో ఇలా మమేకమవడం వల్ల నాగదోషం తొలగుతుందని నమ్మకం ఉంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే పాముల పట్ల భయం లేకుండా పెంపకం సాగిస్తారు.
పర్యాటక ఆకర్షణగా మారిన పాము పండుగ
ఇప్పటికే ఈ పండుగ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో, ఇది పర్యాటక ఆకర్షణగా మారింది. పాములతో ఊరేగే వీడియోలు వైరల్ గా మారాయి. ఫోటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ క్రియేటర్లు ఈ ఊరిని సందర్శించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం దీన్ని తమ సంప్రదాయ పండుగగా కొనసాగిస్తూ, పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ కథ వినగానే చాలా మందికి అసహజంగా అనిపించొచ్చు. కానీ ఈ గ్రామ ప్రజలకు ఇది జీవన శైలి. పాముల పట్ల ఉన్న ప్రేమ, భయాన్ని ఆత్మవిశ్వాసంతో ఓర్పుగా తరిమికొట్టిన ఈ పండుగ మనకు ఎంతో నేర్పుతుంది.. అదేమిటంటే భయం కాదు, భక్తే నిజమైన శక్తి అని కదా!
పాములను మెడలో ధరించి ఊరేగిస్తూ పూజలు
దేశవ్యాప్తంగా నాగ పంచమి రోజున పాములకు పాలు పోసే సంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే దేశంలో ఒక గ్రామంలో నాగ పంచమి సందర్భంగా వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసుకువస్తారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు నది నుంచి బయటకు తీసిన పాములతో పిల్లలలా… pic.twitter.com/myIIvdviFh
— ChotaNews App (@ChotaNewsApp) July 17, 2025