OTT Movies : థియేటర్లలోకి రిలీజ్ అయిన కొత్త సినిమాలు వెంటనే ఓటీటీలోకి దర్శనం ఇస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాలు అయితే ముందుగానే ఓటీటీలో డేట్ ను లాక్ చేసుకొని అనుకున్న టైం కు స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి.. రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు సినిమాలు ఒకేసారి ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఆ సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్, యాక్షన్ మూవీ జాక్ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది యావరేజ్ టాక్ ను అందుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. అలాగే యాంకర్ ప్రదీప్ చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ కూడా ఓటీటీలోకి వచ్చేందుకు టైం ను ఫిక్స్ చేసుకుంది. ఈ రెండు ఓటీటీల గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.
జాక్ మూవీ..
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం జాక్.. ఏప్రిల్ 10వ తేదీన జాక్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మంచి క్రేజ్‍తో వచ్చి బాక్సాఫీస్ వద్ద చతిసిలపడింది. యావరేజ్ టాక్‍తో పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.10కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా చేరలేకపోయింది.. దాంతో థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపిక జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ.. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రదన్ సంగీతం అందించారు. ఈ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ప్రొడ్యూజ్ చేసింది. గత నెల ఏప్రిల్ 11న ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్దిరోజుల వరకే ఈ సినిమా థియేటర్లలో రన్ అయింది.. ఇక ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ కు రాబోతుంది. మరి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ సినిమాలు కనీసం ఓటీటీలో అయిన ఆకట్టుకుంటాయేమో చూడాలి..
Also Read :కమెడియన్ భరత్ జీవితంలో విషాదం.. గుండెబరువెక్కే బాధలు..
భారీ అంచనాలతో వచ్చిన జాక్ సినిమా అందుకోవడంతో సిద్దు జొన్నలగడ్డ ఫ్యాన్స్ నిరాశన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ తేలిపోయింది అనే టాక్ ని అందుకోవడంతో బొమ్మరిల్లు భాస్కర్ పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.. మరి నెక్స్ట్ సిద్దు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు చూడాలి. గతంలో ఈయన నటించిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ సినిమా రాబోతుందని గతంలో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సిద్దు ఆ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..