BigTV English

Ivana: టాలీవుడ్లో గొప్ప వాళ్ళు లేరు… ఈ కొత్త హీరోయిన్ అంత మాట అనేసిందేంటి..?

Ivana: టాలీవుడ్లో గొప్ప వాళ్ళు లేరు… ఈ కొత్త హీరోయిన్ అంత మాట అనేసిందేంటి..?

Ivana: ఇవానా అసలు పేరు అలీనా షాజీ. సినీ రంగంలో అడిగిపెట్టి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ లో ఏ పరుచుకున్నారు.లవ్ టుడే మూవీతో పాపులర్ అయ్యారు. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి ఇవానాను తెలుగు ఆడియోస్ కు దగ్గర చేసింది. వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. సెల్ఫిష్ అనే మూవీతో తెలుగులో పరిచయమయ్యారు. తమిళ్, మలయాళం మూవీలలో ఎక్కువగా నటించిన ఇవానా తెలుగులో మరో మూవీతో మన ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈమె నటించిన సింగిల్ సినిమా మే 9ను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.


టాలీవుడ్లో గొప్ప వాళ్ళు లేరు..

గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించిన ఇవానా విభిన్నమైన పాత్రలతో అభిమానులకు దగ్గరవుతున్నారు. శ్రీ విష్ణు హీరోగా సింగిల్ మూవీలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో, మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అనే ప్రశ్న ఎదురుగా ఇవానా మాట్లాడుతూ.. నాకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఇన్స్పిరేషన్ అంటూ ఎవరూ లేరు. ఇక్కడ అలాంటి వారు లేరు కానీ కొంతమంది నటులు ఉంటే నాకు చాలా ఇష్టం అని, అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ సమంత, సాయి పల్లవి మీరు యాక్టర్స్ గా నాకు చాలా ఇష్టం. సమంతా లైఫ్ లో ఆమె ఎదుర్కొన్న సమస్యలకు ఆమె నిలబడిన స్ట్రాంగ్ నెస్ నాకు చాలా నచ్చుతుంది అని ఇవానా తెలిపింది.ఈ వీడియో చూసిన వారంతా టాలీవుడ్ లో ఎంతోమంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వస్తారు. కానీ ఇవానా ఇండస్ట్రీలో తన ఇన్స్పిరేషన్ అంటూ ఎవరూ లేరని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


సింగిల్ మూవీ లో ఆ పాత్ర తో ..

శ్రీ విష్ణు తో కలిసి ఇవానా సింగిల్ మూవీ తో మే 9 న ప్రేక్షకులు ముందు రానుంది. ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కోప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా కేతిక నటిస్తుంది. ఇవానా 2012లో మాస్టర్స్ రాణి పద్మిని వంటి సినిమాలలో నటించిన అవి అంత గుర్తింపు రాలేదు. 2019లో వచ్చిన హీరో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో వచ్చిన లవ్ టుడే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నారు. 2003లో ఎల్జీఎం, మూవీలో నటించారు.తెలుగు లో మరెన్నో మూవీస్ తో అలరించాలని అభిమానులు కోరుకుంటారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×