Gundeninda GudiGantalu Today episode April 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు గదిలోకి వెళ్తారు. మీనా మాట నిలబెట్టుకున్నందుకు బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. నా మాటని మీరు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి బాలు బంగారం కొనిస్తే భార్యలు ఇలా సంతోషపడతారా అని అడుగుతారు. బంగారం కొన్నందుకు కాదు బంగారం కన్నా ఎక్కువైనా నా మాటని మీరు నిలబెట్టారు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మీనా అంటుంది. దానికి బాలు నువ్వు నీ బంగారు ఇచ్చినప్పుడు లిస్ట్ రాసావు కదా అందులోంచి పుస్తెలు తీసేయి మిగతా ఒక్కోటి ఒక్కోటిగా మనం కొనేద్దామనేసి బాలు అంటాడు. మిగిలినవి నాకు ఇప్పుడు ఏమి అక్కర్లేదండి పుస్తెలు చాలు అని మీనా అంటుంది. మీ అప్పులు తీరాకే నాకు మిగిలినవి కొనివ్వొచ్చు అని అంటుంది. మీనా మాటలు విన్న బాలు సంతోషపడతాడు. వీరిద్దరి ఎమోషనల్ సీన్ ఎపిసోడ్కి హైలెట్ అవుతుంది. రోహిణికి ప్రభావతి బిగ్ షాక్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. మీనా మెడలో పుస్తెలు వేసుకోవడం చూసి ప్రభావతి ఓర్వలేక పోతుంది. కారు డ్రైవరే దానికి బంగారం కొనిస్తే మరి నా ఇద్దరు కోడలు కూడా బంగారం వేసుకొని తిరగాలి కదా దాని ముందు దర్జాగా ఉండాలి కదా అనేసి ప్రభావతి ఆలోచిస్తుంది. ఇక అనుకున్నట్లుగానే ముందుగా రోహిణి దగ్గరికి వెళ్లిన ప్రభావతి ఆఫ్ట్రాల్ కారు డ్రైవింగ్ చేసుకునే వాడే బంగారం కొంటున్నాడు మరి నీ దగ్గర అన్ని బంగారు నగలు ఉన్నాయి కదా నువ్వు వేసుకోకుండా బయటికి వెళ్ళవద్దు అనేసి అడుగుతుంది. దానికి రోహిణి షాక్ అవుతుంది. బంగారు నగలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఈవిడ ఆశలకైనా ఒక హద్దు ఉండాలి రోజుకు ఒక విధంగా నన్ను చంపేస్తుంది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది.
ఏంటమ్మా రోహిణి ఆలోచిస్తున్నావు నీ నగలు ఉన్నాయి కదా పెళ్లి అవి వేసుకుని పార్లర్కి వెళ్ళు,. నువ్వు అసలే పార్లర్కి ఓనర్వి కదా ఓనర్ లాగే ఉండాలి ఇలా వెళ్తే పనోళ్ళు అనుకుంటారు అని ప్రభావతి అనగానే రోహిణి కాసేపు షాక్ అవుతుంది అది కాదు ఆంటీ ఇప్పుడు కస్టమర్లు అందరూ నేనెలా చేయాలని ఆలోచిస్తారు నేను చేసే వర్క్ విషయంలో కాస్త బిజీగా ఉంటాను ఇప్పుడు నగలు వేసుకొని అక్కడ తిరిగితే ఏం బాగుంటుంది పైగా నగల కోసమే ఫోజు కొడుతుంది అనుకుంటారేమో అని రోహిణి ప్రభావతికి రివర్స్ షాక్ ఇస్తుంది..
అయినా కూడా మెడలో ఒట్టి పసుపు తాడుతోనే వెళ్తున్నావ్ కనీసం తాడైన వేసుకుని వెళ్ళు అని ప్రభావతి.. మీకు బాలు చేయించాడు. మీనా గౌరవాన్ని బాలు పెంచాడు. అలాగే మనోజ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కదా ఆంటీ.. మనోజ్ కూడా ఏదైనా బంగారు నాకు కొంటే నేను గొప్పగా చెప్పుకొని మనోజ్ ని తిట్టిన వారి నోరు మూయించి మరీ వేసుకుంటానని మనోజ్ ని ఇరికిస్తుంది. సరే అమ్మ నీ ఇష్టం. వాడు ఎలాగో జాబ్ లో జాయిన్ అయ్యాడు కదా నీకోసం ఆ మాత్రం చేయలేడు అనేసి ప్రభావతి గొప్పలు చెప్తుంది.
రోహిణి ఈవిడని ఎలాగోలాగా మాటలతో మాయ చేసాను కానీ ఈ దిలీప్ వాడికి గోల్ ఏంటి నాకు అని ఆలోచిస్తూ ఉంటుంది. వీడికి ఎలాగైనా చెక్కు పెట్టాలి లేకపోతే నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక మీనా ఈ పుస్తె లు నా మెడలో మీరే వేయాలి మనం గుడి కి వెళ్ళాలి అని తర్వాత రోజు ఉదయం బాలు దగ్గరికి వెళ్లి అడుగుతుంది. మా పూల గంప సంతోషమే నా సంతోషమని బాలు అంటాడు.. మీరు లేచి రెడీ అయ్యి ఈ పంచ కట్టుకోండి అని మీనా అడుగుతుంది.
బాలు, మీనా ఇద్దరు కలిసి సంతోషంగా గుడికి వెళ్తారు. అప్పటికే మీనా తన అమ్మ చెల్లి తమ్ముడు తో కలిసి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయిస్తుంది. మన పెళ్లి జరిగినప్పుడు మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మనిద్దరం ఒక్కరంటే ఒకరు ఇష్టపడి మరి పెళ్లి చేసుకుందామని మీనాతో బాలు అంటాడు.. ఇక ఇద్దరూ సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చొని మరోసారి పెళ్లి చేసుకుంటారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..