BigTV English

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

OTT Movie:ఈమధ్య కాలంలో సినిమాలు అలా థియేటర్లలో విడుదలవుతున్నాయో లేదో ఇలా ఆరు వారాలు లేదా ఎనిమిది వారాలకే ఓటీటీలోకి వచ్చేసి ఇటు ఓటీటీ ప్రియులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.. మరికొన్ని సినిమాలు కేవలం కొన్ని భాషల్లోనే స్ట్రీమింగ్ అవుతూ మిగతా భాషల ఆడియన్స్ ను నిరాశ పరుస్తూ ఉంటాయి. అలా మిగతా భాషలలో ప్రేక్షకులను అలరించి తెలుగు ఆడియన్స్ ను డిసప్పాయింట్ చేసిన అనుపమ కొత్త మూవీ.. కూడా సైలెంట్ గా ఓటీటీలోకి రావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అనుపమ నటించిన ఆ కొత్త మూవీ ఏంటి? ఏ ఫ్లాట్ ఫామ్ లో చూడవచ్చు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ..

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషిస్తూ.. తెరకెక్కిన చిత్రం పరదా (Parada)..ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చింది. అటు మరో మూడు వారాలలో ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటిస్తున్న ‘కిష్కిందకాండ’ అనే హార్రర్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా పలు వివాదాలలో చిక్కుకొని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అదేదో కాదు కోర్టు రూమ్ థ్రిల్లర్ స్టోరీ తో వచ్చిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. గత వారం ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా. మలయాళం, కన్నడ, తమిళ్ , హిందీ వెర్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు అభిమానులు కాస్తా డిసప్పాయింట్ అవ్వగా.. ఇప్పుడు వాళ్లకోసం అన్నట్టు వారం లేటుగా తెలుగు వెర్షన్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక ప్రస్తుతం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. మొత్తానికైతే సైలెంట్ గా తెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను మెప్పించబోతోంది ఈ సినిమా.


జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ స్టోరీ..

జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విషయానికి వస్తే .. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. పండుగ కోసం కేరళలోని సొంత ఊరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్ళగా.. అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తుంది. ఇక ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో లాయర్ డేవిడ్ (సురేష్ గోపి) ఎవరి వైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండానే తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలన్న జానకి విజ్ఞప్తిపై కేరళ కోర్ట్ ఎలాంటి స్పందించింది? ఆమెకు న్యాయం జరిగిందా? ఆమెను అన్యాయం చేసిన వాడికి శిక్ష పడిందా? ఇలా కొన్ని విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా ప్రసారమవుతోంది.. మరి ఏ మేరకు ఇక్కడ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related News

War 2 OTT: ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న వార్ 2… ఎక్కడ చూడొచ్చంటే!

OTT Movie : బతికుండగానే మనుషుల్ని మటన్ లా తినేసే సైతాన్… వెన్నులో వణుకు పుట్టించే మూవీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి అమ్మాయిపై అలాంటి కోరికలు… అన్నీ అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు భయ్యా

OTT Movie : నవ వధువుతో తెల్లార్లూ అదే పని… ఇదెక్కడి దిక్కుమాలిన దుష్టశక్తి… ఈ దెయ్యం అరాచకాన్ని తట్టుకోవడం కష్టం సామీ

OTT Movie : పేదమ్మాయిపై ప్రేమ… మొత్తం మత్తెక్కించే సీన్లే భయ్యా… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : భార్య శవం మిస్సింగ్… భర్తతో పాటు అతని ప్రేయసికీ చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్టు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డెడ్ బాడీ తలలో క్యాప్సిల్… హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ మావా

OTT Movie : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?

Big Stories

×