Pragyan ojha: భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} సెలక్షన్ కమిటీలో కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మొదట అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీ సెలక్షన్ ప్యానెల్ లో టీమిండియా మాజీ స్పిన్నర్, మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజా ను చేర్చే అవకాశం ఉందని పలు రూమర్స్ వినిపించాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పదవీ కాలాన్ని బీసీసీ పొడిగించిందని.. సౌత్ జోన్ సెలెక్టర్ శ్రీధరన్ శరత్ తో పాటు మరొకరిపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు పలు వార్తలు వెలువడ్డాయి.
Also Read: Samson brothers: తమ్ముడి కెప్టెన్సీలో ఆడుతున్న టీమిండియా ప్లేయర్
ఈ క్రమంలోనే జాతీయ సెలక్టర్ పదవులకు భారత క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగర్కర్ తో పాటు ఎస్ఎస్ దాస్, సుభ్రతో బెనర్జీ, ఎస్ శరత్, అజయ్ రాత్ర ఉన్నారు. టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి జాతీయ సెలక్టర్ అయ్యే అవకాశం ఉందని పలు రిపోర్ట్ లు పేర్కొన్నాయి. సెలెక్టర్ గా దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్ శరత్ స్థానంలో ఓజా ఎంపిక కానున్నట్లు పలు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. తాజాగా మరో వార్త సంచలనంగా మారింది. చీఫ్ కలెక్టర్ అజిత్ అగర్కర్ ని తన పదవి నుంచి తొలగించి.. ప్రజ్ఞాన్ ఓజాకు టీమిండియా సెలక్షన్ కమిటీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
నిజానికి బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ లోని కేవలం రెండు పదవులకు మాత్రమే ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిని సమర్పించడానికి సెప్టెంబర్ 10 చివరి తేదీ. అయితే ఏ అభ్యర్థులను భర్తీ చేస్తారు..? కొత్త సభ్యులు ఏ జోన్లకు ప్రతినిత్యం వహిస్తారో మాత్రం బీసీసీఐ పేర్కొనలేదు. అయితే తాజాగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా ని ఎంపిక చేయాలని భావిస్తుందట బిసిసిఐ. ప్రజ్ఞాన్ ఓజా.. రోహిత్ శర్మ కి క్లోజ్ ఫ్రెండ్. ఇతడు చీఫ్ సెలెక్టర్ గా ఎంపిక అయితే మాత్రం రోహిత్ శర్మకు ఇది ప్లస్ అవుతుందని.. దీంతో రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశాలు ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
Also Read: Hardik Pandya: టాలీవుడ్ హీరోయిన్ తో హార్దిక్ పాండ్య పెళ్ళి.. ఇదిగో వీడియో
ప్రజ్ఞాన్ ఓజా తన కెరీర్ లో 24 టెస్టులు, 18 వన్డేలు, ఆరు టి-20 లలో మాత్రమే టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో ప్రజ్ఞాన్ ముంబై ఇండియన్స్, దక్కన్ చార్జర్స్ తరఫున ఆడాడు. అయితే టీమిండియా సెలెక్టర్ పదవికి దరఖాస్తు తీసుకోవాలంటే కనీసం ఏడు టెస్ట్ లు లేదా 10 వన్డేలు, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాలి. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి. బీసీసీఐ ఏ క్రికెట్ కమిటీ లోను ఐదు సంవత్సరాలపాటు సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు. మరోవైపు సెలెక్టర్లకు కాంట్రాక్టులు ప్రతి సంవత్సరం రివ్యూ అవుతాయని బీసీసీఐ అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఎవరిని రీప్లేస్ చేయాలన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని.. ఆ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.