Jio Hotstar : ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే అందులో కొరియన్ థ్రిల్లర్ సినిమాలు ప్రత్యేకమని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కొరియన్ సినిమాలంటే చెవి కోసుకునే వారి కోసం బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను మీకోసం తీసుకొచ్చాం. వాటిలో కొన్ని బెంచ్ మార్క్ సెట్టింగ్ సినిమాలు ఉండడం విశేషం. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలన్నీ కూడా జియో హాట్ స్టార్ ఓటీటీలోనే ఉన్నాయి. అదిరిపోయే ట్విస్ట్ లతో ఆకట్టుకునే ఆ థ్రిల్లర్ సినిమాలు ఏంటో చూసేద్దాం పదండి.
మెమోరీస్ ఆఫ్ మర్డర్ (Memories of Murder)
డార్క్ కామెడీ, ఊహించని ట్విస్ట్ లతో అదిరిపోయే థ్రిల్లర్ మూవీ ‘మెమోరీస్ ఆఫ్ మర్డర్ ‘. బాంగే జూన్ హూ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సీరియల్ కిల్లర్ మూవీ ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు.
డెలివర్ అజ్ ఫ్రమ్ ఈవిల్ (Deliver us from Evil)
ఈ మూవీ ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ థ్రిల్లర్ రైడ్ లా ఉంటుంది. ఇందులో ఉండే క్రేజీయస్ట్ చేజ్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఇద్దరు హంతకులు ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికి తలపడడం చూస్తే ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. గౌరవం కోసం, చావు బతుకుల పోరాటంలో వీరిద్దరి మధ్య జరిగే ఫైట్ ను తెరపై చూసి తీరాల్సిందే.
ది మ్యాన్ ఫ్రం నో వేర్ (The Man From Nowhere)
ఈ సినిమాలో గతంలో మంచి ఫైటింగ్, హంటింగ్ స్కిల్స్ ఉన్న హీరో, ఇప్పుడు డ్రగ్స్ అండ్ ఆర్గాన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లో చిక్కుకుంటాడు. మరోవైపు రెండు గ్యాంగ్ ల మధ్య అధికారం కోసం ఫైట్ జరుగుతుంది. ఆ రెండు గ్యాంగ్ ల నుంచి హీరో ఎలా బయట పడ్డాడు అనేది స్టోరీ.
ఇన్సైడ్ మెన్ (Inside Men)
సినీ ప్రియుడైన గ్యాంగ్ స్టార్, కరప్టెడ్ న్యూస్ పేపర్ ఎడిటర్ కలిసి ఓ వ్యక్తిని మోసం, కుంభకోణం వంటి కేసుల్లో అనవసరంగా ఇరికిస్తారు. ఆ తర్వాత వాటి నుంచి హీరో ఎలా బయట పడ్డాడు అనే స్టోరీని గ్రిప్పింగ్ కథగా మలిచారు మేకర్స్.
ఎ బిట్టర్ స్వీట్ లైఫ్ (A Bittersweet life)
ఒక గ్యాంగ్ స్టర్ తన యజమానికి చెందిన అమ్మాయి విషయాలలో ఎమోషనల్ అవుతాడు. దీంతో అతని లాయల్టీని టెస్ట్ చేస్తారు. ఇందులో అతను గెలిచాడా? ఆ అమ్మాయి కోసం ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది స్టోరీ.
ది మ్యాన్ స్టాండింగ్ నెక్స్ట్ (The Man Standing Next)
1972లో కొరియా రాజకీయ చరిత్రలోని అల్లకలోల సమయం ఆధారంగా ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ ను తెరపైకి తీసుకొచ్చారు. అనుమానం, అపనమ్మకం, వెన్నుపోటు వంటి అంశాల ఆధారంగా రూపొందింది ఈ పొలిటికల్ థ్రిల్లర్.
ది గ్యాంగ్ స్టర్, ది కాప్, ది డెవిల్ (The Gangster The Cop The Devil)
ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ తో కలిసి పోలీస్ ఒక ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశారు అనేది స్టోరీ.
ఐ సా ది డెవిల్ (I Saw The Devil)
ఇదొక డార్క్ థ్రిల్లర్. పగ తీర్చుకోవడం అనే అంశం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.