OTT Movie : పంజాబ్‌లో సితారా (దిల్జిత్ దోసాంఝ్) అనే ఒక అనాథ, ఒక ప్రముఖ గాయకుడి శిష్యుడిగా, ఆ ఇంటి సహాయకుడిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ అతని సంగీత ప్రతిభను తన గురువు అణచివేసే ధోరణికి బాధపడి, అతను స్వతంత్రంగా తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. అతను కమల్‌జోత్ (నిమ్రత్ ఖైరా) అనే గాయనితో కలిసి ఒక స్టేజ్ షో ని ఏర్పాటు చేస్తాడు. ఈ షో పంజాబ్‌లో సంచలనం సృష్టిస్తుంది. ఇక వీళ్ళ మధ్య ప్రేమకథ కూడా నడుస్తుంది. ఆ తరువాత వీళ్ళకు అనేక సవాళ్ళు ఎదురవుతాయి. ఇక ఈ జోడీ తమ ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది? వీళ్ళ లవ్ స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఇది 1980ల పంజాబ్‌లోని జానపద సంగీత ప్రపంచంలో జరిగే ఒక జంట ప్రేమకథ, వీళ్ళ సంగీత ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. కథ సితారా (దిల్జిత్ దోసాంఝ్) అనే అనాథతో మొదలౌతుంది. ఇతను ఒక ప్రముఖ గాయకుడి శిష్యుడిగా పనిచేస్తూ, ఇంటి పనుల్లో బిజీగా ఉంటాడు. అతని గురువు సితారా ప్రతిభకు భయపడి, అతని సంగీత కెరీర్‌ను అణచివేస్తాడు. ఈ వాస్తవాన్ని గ్రహించిన సితారా, తనకంటూ సొంత గుర్తింపును స్థాపించాలని నిర్ణయించుకుంటాడు. కమల్‌జోత్ (నిమ్రత్ ఖైరా) అనే యువ గాయనితో జతకడతాడు. వీళ్ళు ఇద్దరూ కలిసి ఒక స్టేజ్ జోడీగా సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభిస్తారు. వీళ్ళ పాటలు పంజాబీ జానపద సంగీతంలో విప్లవాత్మక మార్పులను తెస్తాయి.
సితారా, కమల్‌జోత్ జోడీ వేగంగా పాపులర్ అవుతుంది. కానీ వీళ్ళ ప్రయాణం విజయవంతంగా వెళ్తుండటంతో, అంతే స్పీడ్ లో శత్రువులు కూడా తయ్యారావుతారు. అదే సమయంలో, వీళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ ఈ జంట వ్యక్తిగత, సామాజిక ఒత్తిళ్లతో సవాళ్లను ఎదుర్కొంటుంది. సితారా తన భార్య, రెండేళ్ల బిడ్డ కోసం కొంతకాలం సాంప్రదాయ సంగీతానికి మారతాడు. కానీ అతని ఆశయాలు, స్వేచ్ఛా భావన అతన్ని తన సొంత శైలికి తిరిగి వెళ్లేలా చేస్తాయి. ఈ నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. చివరికి సితారా, కమల్‌జోత్‌ను బెదిరించే తీవ్రవాదులు ఎవరు ? తీవ్రవాదుల ఉద్దేశాలు ఏమిటి? ఈ జంట లవ్ స్టోరీ చివరికి ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా 1980ల పంజాబ్ జానపద సంగీత వాతావరణాన్ని తిరిగి తెచ్చినందుకు ప్రశంసలు అందుకుంది. దిల్జిత్ దోసాంఝ్, నిమ్రత్ ఖైరా నటన, అంబర్‌దీప్ సింగ్ స్క్రీన్‌ప్లే, పాటల సెట్టింగ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ పంజాబీ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘జోడీ’ (Jodi). 2023 లో వచ్చిన ఈ సినిమాకి అంబర్‌దీప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దిల్జిత్ దోసాంఝ్, నిమ్రత్ ఖైరా ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని రిథమ్ బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, థిండ్ మోషన్ ఫిల్మ్స్ బ్యానర్‌లలో కరజ్ గిల్, దల్జిత్ థిండ్ నిర్మించారు. ఈ స్టోరీ 1980 నాటి కాలంలో, పంజాబ్ నేపథ్యంలో సెట్ చేయబడింది. ఇది పంజాబీ జానపద సంగీత ద్వయం అమర్ సింగ్ చమ్కిలా, అమర్‌జోత్ కౌర్ జీవితాల నుండి స్ఫూర్తి పొందినదని చెప్పబడింది. ఈ మూవీ 2023 మే 5న థియేటర్లలో విడుదలైంది. 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 8.1/10 రేటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం Chaupal OTT ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.