Electric shock: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు స్పాట్ లో మృతిచెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన, పిడుగులు పడే ఛాన్స్
పోలీసుల వివరాల ప్రకారం.. వినాయకచవితి సమీపిస్తున్నందున కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. బాలాజీ వినాయక విగ్రహాల తయారి కేంద్రంలో భారీ గణపతి విగ్రహాన్ని తయారుచేశారు. అయితే భారీ గణేష్ (13 అడుగల ఎత్తు) విగ్రహాన్ని ఒకచోటి నుంచి మరో చోటికి తరలిస్తుండగా కరెంట్ వైర్లు తగిలి తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Snake News: వర్షాకాలం జాగ్రత్త.. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే పాములకు వణుకు పుట్టాల్సిందే!