OTT Movie : ఓటిటిలో రకరకాల కథలతో, సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లను మిస్ కాకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ స్టోరీ అండమాన్ నికోబార్ లో జరుగుతుంది. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్, చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కాలా పానీ’ (Kaala paani). దీనిని సమీర్ సక్సేనా రూపొందించారు. ఇందులో అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, వికాస్ కుమార్, చిన్మయ్ మాండ్లేకర్, సుకాంత్ గోయెల్, అరుషి శర్మ, రాధికా మెహ్రోత్రా, పూర్ణిమ ఇంద్రజిత్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 అక్టోబరు 18వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ అండమాన్, నికోబార్ దీవులలో సెట్ చేయబడింది. ఇక్కడ ఒక రహస్యమైన ప్రాణాంతకమైన వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అక్కడ చాలా గందరగోళ పరిస్తితులు ఏర్పడతాయి.
స్టోరీలోకి వెళితే
అండమాన్ దీవులలో అక్కడ నివసించే వాళ్ళు, స్వరాజ్ మహోత్సవం అనే పర్యాటక ఉత్సవం జరుపుకోవాలనుకుంటారు. ఇది ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌదామిని సింగ్, ఒక విచిత్రమైన వ్యాధిని గుర్తిస్తుంది. ఇది గతంలో దీవులలో వ్యాపించిన వ్యాధిని పోలి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలలో మెడపై నల్లని దద్దుర్లు, తీవ్రమైన దగ్గు, ఆతరువాత ఆకస్మిక మరణం సంభవిస్తుంది. డాక్టర్ సౌదామిని ఈ వ్యాధి మహమ్మారిగా మారే అవకాశం ఉందని అధికారులను హెచ్చరిస్తుంది. కానీ స్థానిక అధికారులు, ఒక బహుళజాతి కార్పొరేట్ కంపెనీ ఆర్థిక లాభాల కోసం ఆమె హెచ్చరికలను పట్టించుకోరు. ఈ కార్పొరేట్ కంపెనీ, అండమాన్ దీవులలో నీటి పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెడుతుంది. అందుకే ఆమె హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటారు అధికారులు. ఈ పైప్‌లైన్ ప్రాజెక్ట్ కూడా స్థానిక ఆదివాసీ భూములను నాశనం చేస్తుంది.
దీనికి తోడు ఈ వ్యాధి కూడా వేగంగా వ్యాప్తి చెందడంతో, ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పుతుంది. ఇక్కడ దీవులు క్వారంటైన్‌లో ఉంచబడతాయి. నివాసితులు, పర్యాటకులు ఎక్కడా కదలలేని పరిస్తితి ఏర్పడుతుంది. వ్యాధి మూలాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దీని వెనుక భారీ కుట్ర కూడా జరుగుతుంది. చివరికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ? ఈ వ్యాధి నుంచి అందరూ బయట పడతారా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ గేమ్ ఆడితే ప్రాణాలతో తిరిగి రారు … బాబోయ్ ఇలాంటి గేమ్ లు కూడా ఉంటాయా ?