ప్రపంచ వైమానిక చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఇన్సిడెంట్ 1990లో జరిగింది. ఫ్లైట్ కెప్టెన్ తో పాటు ఏకంగా విమానంలోని 87 మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. తోటి పైలెట్ సమయ స్ఫూర్తి, విమాన సిబ్బంది చాకచక్యంతో విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన యుకె నుంచి స్పెయిన్ కు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
10 జూన్ 1990లో బ్రటిష్ ఎయిర్ వేస్ కు చెందిన 5390 నెంబర్ గ విమానం యుకెలోని బర్మింగ్ హామ్ విమానాశ్రయం నుంచి స్పెయిన్ లోని మాలాగాకి బయల్దేరింది.ఇంగ్లాండ్ లోని డిడ్ కాట్ మీదిగా ఎరుగుతున్న సమయంలో అనుకోని ఘటన జరిగింది. విండ్ స్క్రీన్ ప్యానెల్ గాలి తీవ్రతకు ఊడిపోయింది. కాకపిట్ లోని పైలట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా గాలి తీవ్రతకు ఆయన విమానం నుంచి బయటకు నెట్టివేయబడ్డాడు. వెంటనే విమానంలోని ఇతర సిబ్బంది అతడు ఎగిరిపోకుండా కాళ్లను బలంగా పట్టుకున్నారు. ఆ సమయంలో విమానం ఏకంగా 17 వేల అడుగుల ఎత్తులో ఉంది.
విమానంలో మొత్తం 87 మంది
ఈ విమానంలో మొత్తం 87 మంది ఉన్నారు. వారిలో 81 మంది ప్రయాణీకులు కాగా, నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలెట్లు. 42 ఏళ్ల కెప్టెన్ తిమోతి లాంకాస్టర్ కాగా, కో పైలెట్ 39 ఏళ్ల అలస్టెయిర్ అయిట్చిసన్. ఇద్దరికీ విమానం నడపడంలో మంచి అనుభవం ఉంది. విమానం బయల్దేరిని కాసేపటికే విమాన డెక్ లోని లాంకాస్టర్ వైపున ఉన్న ఎడమ విండ్ స్క్రీన్ ప్యానెల్ ఊడిపోయింది. అతడు కొద్ది సేపటి ముందే కోపైలెట్ కు విమానం నడపమని చెప్పి తను రిలాక్స్ అవుతున్నాడు. సీట్ బెల్ట్ కాస్త లూజ్ చేశాడు. అప్పడే ఈ ఘటన జరగడంతో గాలి తీవ్రతకు అతడు బయటికి నెట్టివేయబడ్డాడు. లక్కీగా అతడి మోకాళ్లు విండ్ షీల్డ్ దగ్గర చిక్కుకున్నాయి. మీగతా శరీరం అంతా బయటే ఉంది. వెంటనే తోటి విమాన సిబ్బంది వచ్చి అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నారు. ఎగిరిపోకుండా సుమారు 20 నిమిషాలు అలాగే పట్టుకున్నారు. అతడిని వదిలిపెడితే తను విమానం రెక్కలకు లేదంటే ఇంజిన్ కు తగిలితే అత్యంత పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రాణాలకు తెగించి ఫ్లైట్ అటెండెంట్ సైమన్ రోజర్స్ పైలట్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు.
సౌతాంఫ్టన్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్
సుమారు 20 నిమిషాల తర్వాత సౌతాంఫ్టన్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతించింది. కో పైలెట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో పైలట్ కుడి చేయి, ఎడమ బొటన వేలు, కుడి మణికట్టుకు గాయాలయ్యాయి. 20 నిమిషాల పాటు తీవ్రమైన మంచు, గాలి తగలడంతో ఈ ఘటన తర్వాత అతడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడ్డాడు. ఈ ఘటనలో అత్యతం చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసిన సిబ్బందికి అత్యుత్తమ ఎయిర్ మ్యాన్ అవార్డులు లభించాయి.
Read Also: మరిన్ని రైళ్లు, చౌకగా విమానాలు, కాశ్మీర్ లోయ నుంచి పర్యాటకుల తరలింపు!