BigTV English

OTT Movie : దెయ్యాల కొంపలో దడుచుకునే ఫ్యామిలీ… చెల్లి కోసం ఆత్మగా మారి…

OTT Movie : దెయ్యాల కొంపలో దడుచుకునే ఫ్యామిలీ… చెల్లి కోసం ఆత్మగా మారి…

OTT Movie : దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గాని, సినిమాలలో మాత్రం వీటిని చక్కగా చూపిస్తుంటారు. ఓటీటీలో ఈ జోనర్లో ఎన్నోసినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతీ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టించే సన్నివేశాలను, కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక ఫ్యామిలీ దెయ్యాల కొంపలో చిక్కుకుపోతుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఒక ఫ్యామిలీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడానికి, 100 సంవత్సరాల పాత ఇంటిని కొనుగోలు చేస్తుంది. ఈ కుటుంబంలోని దంపతులకు, గ్రీవింగ్ అనే కుమార్తె, ఒక టీనేజ్ కుమారుడు ఉంటారు . వాళ్ళు కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లిన తర్వాత, అక్కడ ఒక అతీంద్రియ శక్తి ఉన్నట్లు గుర్తిస్తారు. అక్కడ ఈ అతీంద్రియ శక్తి, ఈ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి గురుంచిన రహస్యాలను తెలుసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ కుటుంబంలోని రహస్యాలు, అతీంద్రియశక్తి రహస్యాలు బయటపడతాయి.


ఈ క్రమంలో ఈ కుటుంబం ఎన్నో ఆటు పొట్లను ఎదుర్కుంటుంది. ఆ దుష్ట శక్తి , ఈ కుటుంబంలోని టీనేజ్ కుర్రాడిని ఆవహిస్తుంది. రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతుంది.  ఫ్యామిలీని కాపాడుకోవటానికి ఆ కుర్రాడు శక్తికి మించిన రిస్క్ చేస్తాడు.  చివరికి ఆ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి ఏమిటి ? ఈ కుటుంబం దానిని నియంత్రించడానికి ఏం చేస్తుంది. ఆ ఇంట్లో గతంలో ఎటువంటి సంఘటనలు జరిగి ఉంటాయి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also కప్పు టీ ఇచ్చిన పాపానికి కొంప కొల్లేరు చేసింది … పక్కా ప్లాన్ తో బోల్తా కొట్టించే లేడీ కిలాడీ మావా

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రెజెన్స్’ (Presence). దీనిని డేవిడ్ కొయెప్ రచించగా, స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో లూసీ లియు, క్రిస్ సుల్లివన్, కాలినా లియాంగ్, ఎడ్డీ మాడే, వెస్ట్ ముల్హోలాండ్ మరియు జూలియా ఫాక్స్ వంటి నటులు నటించారు. ‘ప్రెజెన్స్’ 2024 జనవరి 19న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది 2025 జనవరి 24న U.S. థియేటర్‌లలో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ పేన్ అనే కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×