BigTV English

Fact Check: ‘పీఎం మోడీ ఏసీ యోజన’ కింద ఉచిత ఏసీ అందిస్తున్నారా? ఇదీ అసలు కథ!

Fact Check: ‘పీఎం మోడీ ఏసీ యోజన’ కింద ఉచిత ఏసీ అందిస్తున్నారా? ఇదీ అసలు కథ!

PM Modi AC Yojana 2025: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్దాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. మోసపూరిత ప్రకటనలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఈ ప్రచారాలను చూసి ప్రజలు ఆకర్షింపబపడుతున్నారు. నిజమని నమ్ముతూ మోసపోతున్నారు. తాజాగా అలాంటి ప్రచారమే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మోడీ ఏసీ యోజన 2025’ అనే పథకం కింద 5 స్టార్ ఏసీలను అందిస్తుందని, 1.5 కోట్ల ఏసీలను ఇప్పటికే పంపిణీకి ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అసలు వాస్తవం ఏంటో వెల్లడించింది.


ఇంతకీ వైరల్ అవుతున్న పోస్టులో ఏం ఉంది? 

ప్రధానమంత్రి మోడీ ఏసీ యోజన కింద ప్రభుత్వం 1.5 కోట్ల ఏసీలను పంపిణీకి సన్నాహాలు చేస్తోందని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ పథకం మే 2025లో ప్రారంభం కానుందని, కేంద్ర విద్యుత్ శాఖ  ఇప్పటికే ఏసీ యూనిట్లను పంపిణీ కోసం ఏర్పాటు చేసిందని ఆ పోస్టులో ఉంది. upsc_matter అనే ఇన్‌ స్టాగ్రామ్ యూజర్ తొలుత ఈ పోస్టును షేర్ చేశారు. భారత ప్రభుత్వం పీఎం మోడీ AC యోజన 2025 కింద అందరికీ ఉచితంగా 5 స్టార్ AC ఇస్తుందని రాసుకొచ్చారు. నివేదికల ప్రకారం ఈ పథకం మే నెలలో ప్రారంభించబడుతుందని వెల్లడించాడు. ఈ పథకం కోసం 1.5 కోట్ల ACలు సిద్ధం చేయబడినందున దేశంలో ACల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏసీ కావాల్సిన వాళ్లు అప్లై చేసుకుంటే 30 రోజుల్లోపు కొత్త ACని పొందే అవకాశం ఉందన్నారు.


అసలు ముచ్చట చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇందులో వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో). ఈ విభాగానికి చెందిన ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టును షేర్ చేసింది. ఈ వైరల్ క్లెయిమ్‌ లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. “‘పీఎం మోదీ ఏసీ యోజన 2025’ అనే కొత్త పథకం కింద ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండిషనర్లను అందిస్తుందని సోషల్ మీడియాలో ఓ పోస్టు విస్తృతంగా షేర్ అవుతున్నది. 1.5 కోట్ల ఏసీలు ఇప్పటికే సిద్ధం చేశామని అందులో రాశారు. ఇదంతా తప్పుడు ప్రచారం. అలాంటి పథకం ఏదీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు” అని PIB వెల్లడించింది.

Read Also: రొయ్యలకు బాగా మద్యం తాగించి.. మలమల మరిగే నూనెలో వేసి.. ఇది ఎక్కడ దొరుకుతుందంటే?

ఇదీ అసలు నిజం! 

‘పీఎం మోడీ ఏసీ యోజన 2025’ పథకం కింద ఉచిత 5-స్టార్ ఏసీ పంపిణీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ అబద్ధమని తేలింది. సోషల్ మీడియాలో ఇటు వంటి తప్పుదారి పట్టించే పోస్ట్‌లకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాటిని నమ్మవద్దని PIB సూచించింది.

Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి, పాక్ ఎంబసీలో కేక్ కటింగ్.. వీడియో వైరల్!

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×