OTT Movie : చేతబడులను, దయ్యాలను వేరు చేసి చూడలేము. చాలా సినిమాలలో చేతబడి లేకుండా స్టోరీ లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీలో చేతబడులు చేస్తున్నారని అనుమానించి కొన్ని హత్యలు కూడా జరుగుతాయి. అందులో హీరోయిన్ తండ్రిని కూడా చంపుతారు. ఆ తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మీరు భయపడాలి అనుకుంటే, ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఖంజాబ్'(Khanzab). 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీకి అంగీ ఉంబారా దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1998లో బన్యువాంగీలో జరిగిన నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఇక్కడ ఒక విచ్‌క్రాఫ్ట్ ఊచకోత సంఘటనలో అనేక మంది చనిపోయారు. ఈ మూవీ రహాయు అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తండ్రిని ఇద్దరు నిన్జాలు తల తెగ్గోయబడటం స్వయంగా చూస్తుంది. ఆ తర్వాత తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. ఈ సినిమా 1 గంట 45 నిమిషాల నిడివితో 2023 ఏప్రిల్ 19న విడుదలైంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
1998 లో ఇండోనేషియాలోని బన్యువాంగీలో జరిగిన ఒక దారుణమైన సంఘటనలో, తన తండ్రి సెమెడిని నిన్జాలు తల తెగ్గోటం రహాయు చూస్తుంది. ఈ సంఘటనలో ఆమె తండ్రి అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత రహాయు సోదరితో కలిసి తన సవతి తల్లి ఇంటికి వెళ్తుంది. నిజానికి రహాయు తల్లి చనిపోయాక, మరో పెళ్లి చేసుకుంటాడు ఆమె తండ్రి. అయితే వారి కుటుంబం మంత్రాల నెపంతో, ముడిపడి ఉందనే అనుమానంతో స్థానికులు వెలివేస్తారు. ఇప్పుడు రహాయు తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ప్రార్థనలు చేయడానికి ఒక మసీదుకు వెళ్తుంది. అయితే ఆమె ప్రార్థనల సమయంలో ఖంజాబ్ అనే దెయ్యం ఆమెను ఇబ్బంది పెడుతుంటుంది. ఖంజాబ్ అనే దయ్యం మసీదులో ప్రార్థనలు ఎవరైనా చేస్తుంటే, ఆ సమయంలో మనుషులను అడ్డుకుని ప్రార్థనలకు భంగం కలిగిస్తాయి.
ఇది మసీదులో ప్రార్థనలను చేయానీకుండా, భయపెడుతూ అడ్డుకుంటూ ఉంటుంది. లేదంటే అనవసరమైన ఆలోచనలతో బుర్ర ఖరాబ్ చేస్తుంది. రహాయు ఈ ఆత్మలతో పోరాడుతూ, తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాలను కనుగొనే ప్రయత్నం చేస్తుంది. స్టోరీ ముందుకు సాగుతున్న కొద్దీ, రహాయు ఒక ఆత్మతో, తన కుటుంబం మీద వచ్చిన శాపం గురించి తెలుసుకుంటుంది. తనతండ్రిని ఎవరు చంపారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చివరికి రహాయు కుటుంభానికి ఉన్న శాపం ఏమిటి? ఆమె తండ్రిని ఎవరు చంపుతారు ? దయ్యాలు రహాయును భయపెట్టడానికి కారణం ఏమిటి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.