E-Paper
Advertisement

Kohrra 2 Release Date : ‘కోహ్రా సీజన్ 2’ అప్డేట్… స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Kohrra 2 Release Date : ‘కోహ్రా సీజన్ 2’ అప్డేట్… స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
Advertisement

Kohrra 2 Release Date : ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంజాబీ సిరీస్ ‘కోహ్రా’ సీజన్ 2 త్వరలో స్ట్రీమింగ్ కానుంది. బరున్ సోబ్తి నటించిన ఈ క్రైమ్ సీజన్ కి సంబంధించి మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు కూడా. ‘కోహ్రా’ అద్భుతమైన విజయం తర్వాత, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కి సీక్వెల్ నిర్మించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే దానిని పూర్తి చేశారు కూడా. ఇక “కోహ్రా సీజన్ 2” కోసం ఇక నిరీక్షణ ముగిసినట్లయింది. ఈ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుందో తెలుసుకుందాం?

‘కోహ్రా సీజన్ 2’ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది?

‘కోహ్రా సీజన్ 2’ (Kohrra 2) 2026 ఫిబ్రవరి 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని, నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. బరున్ సోబ్తి, మోనా సింగ్ నటించిన ఈ సిరీస్ పంజాబ్ నేపథ్యంలో ఉత్కంఠంగా సాగనుంది. ఈ షో క్రియేటర్ సుదీప్ శర్మ, ఈ సీజన్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫైసల్ రెహమాన్ కూడా దర్శకత్వ బాధ్యతలు పంచుకుంటున్నారు. ఇక మొదటి సీజన్ 2023లో విడుదలై భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు వంటి ఐదు ప్రధాన అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు రాబోతున్న సీజన్ 2 ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సీజన్‌లో మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె సీనియర్ పోలీస్ అధికారిణి ‘ధన్వంత్ కౌర్’ పాత్రలో కనిపించనున్నారు. మొదటి సీజన్‌లో అమర్‌పాల్ గరుండిగా మెప్పించిన బరుణ్ సోబ్తి, ఈ సీజన్‌లో కూడా అదే పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర జగ్రానా నుండి దలేర్‌పురా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయినట్లు చూపించనున్నారు. ఈ సీజన్ పంజాబ్‌లోని ఒక కొత్త నగరంలో జరుగుతుంది. ఒక కొత్త హత్య కేసును ఛేదించే క్రమంలో ఈ సిరీస్ ఉత్కంఠంగా మొదలవుతుంది. ఇందులో అమర్‌పాల్ గరుండి, ధన్వంత్ కౌర్ కలిసి తమ గతాలతో పోరాడుతూ కొత్త కేసులను పరిష్కరిస్తారు. ఇక ఈ సిరీస్ ని చూసి ఆనందించడానికి కొంత కాలం ఆగాల్సిందే.

Read Also :  కూతురి చావుపై అనుమానం… కన్నింగ్ అల్లుడి కొత్త కాపురంపై మామ కన్ను… నరాలు కట్టయ్యే సస్పెన్స్ భయ్యా ఇదీ

Tags

Related News

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×