E-Paper
Advertisement

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో
Advertisement

Korean Aviation Disaster Thriller: ఒక విమానం గాల్లో ఎగురుతోంది… వందలాది మంది ప్రయాణికులు ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఓ ప్రయాణికుడు చేసిన పిచ్చి పని వల్ల విమానం మొత్తం మరణపు ఉచ్చుగా మారిపోతుంది. క్షణాల్లోనే మనుషులు రక్తం కక్కుకుంటూ చనిపోవడం మొదలవుతుంది. పైలట్లకు కూడా వైరస్ సోకడంతో విమానం కంట్రోల్ తప్పుతుంది. ఎలాగోలా విమానాన్ని కంట్రోల్‌లోకి తీసుకున్నా… అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. వైరస్ బయట ప్రపంచానికి వ్యాపిస్తుందనే భయంతో ఏ దేశం కూడా ఆ విమానాన్ని ల్యాండ్ చేసుకోవడానికి అంగీకరించదు. చివరికి సొంత దేశం కూడా చేతులెత్తేస్తుంది. మరి ఆ విమానంలో ఉన్న వందలాది మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటి ? వారిని కాపాడేందుకు భూమిపై ఉన్న పోలీసులు ఏం చేశారు? ఉత్కంఠభరితమైన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ (Emergency Declaration). మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సైకో సైంటిస్ట్ జిన్-సియోక్. ఓ విమానంపై బయోలాజికల్ దాడి చేయబోతున్నానంటూ ఆన్‌లైన్‌లో వీడియో విడుదల చేస్తాడు. దాన్ని చూసిన పోలీస్ డిటెక్టివ్ ఇన్-హో వెంటనే దర్యాప్తు మొదలుపెడతాడు. జిన్-సియోక్ ఇంట్లో అతడికి భయంకరమైన ప్రయోగశాల, శవాలు కనిపిస్తాయి. కానీ అప్పటికే విలన్ ఇంచియాన్ నుంచి అమెరికాలోని హోనలులుకు బయలుదేరే KI501 విమానం ఎక్కేశాడని తెలుస్తుంది.

Advertisement

విమానం గాల్లోకి వెళ్లిన తర్వాత జిన్-సియోక్ తన అసలు ప్లాన్ అమలు చేస్తాడు. ఓ ప్రాణాంతక వైరస్‌ను విమానంలో వ్యాపింపజేస్తాడు. కొద్దిసేపటికే ప్రయాణికులు తీవ్ర అనారోగ్యానికి గురై రక్తం కక్కుకుంటూ చనిపోవడం మొదలవుతుంది. పైలట్ కూడా వైరస్ బారిన పడటంతో విమానం అదుపు తప్పే పరిస్థితి వస్తుంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న మాజీ పైలట్ జే-హ్యుక్ తనకు ఉన్న విమాన భయాన్ని పక్కనపెట్టి కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరుతుంది.

కానీ వైరస్ తమ దేశంలోకి వస్తే వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడతారని భావించిన అమెరికా, జపాన్ కూడా విమానాన్ని ల్యాండ్ చేయడానికి నిరాకరిస్తాయి. చివరికి సొంత దేశమైన దక్షిణ కొరియాలో కూడా ప్రజలు ఆ విమానాన్ని తమ దేశంలోకి అనుమతించవద్దంటూ నిరసనలు చేస్తారు. మరోవైపు భూమిపై ఉన్న ఇన్-హో ఎలాగైనా ఆ వైరస్‌కు యాంటీడోట్ కనిపెట్టాలని ప్రయత్నిస్తాడు. విమానంలోని ప్రయాణికులు కూడా తమ ప్రాణాల కంటే మిగతా ప్రపంచం ప్రాణాలే ముఖ్యమని భావించే స్థితికి వస్తారు.

Advertisement

తాము ల్యాండ్ అయితే వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో విమానాన్ని నేలపైకి దించకూడదని నిర్ణయించుకునేంత ఎమోషనల్ పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఇన్-హో యాంటీడోట్ కనిపెట్టాడా ? ఆ ప్రయాణికులను ఎలా కాపాడారు ? ఇంధనం పూర్తిగా అయిపోకముందే జే-హ్యుక్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విమానాన్ని ఎలా ల్యాండ్ చేశాడు ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ చూడవచ్చు

‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. కొరియన్ ఒరిజినల్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో చూడవచ్చు. విమాన ప్రమాదాలు, వైరస్ థ్రిల్లర్స్, సర్వైవల్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ మూవీని డోంట్ మిస్. ముఖ్యంగా విమానం గాల్లో అదుపు తప్పే సన్నివేశాలు, ప్రయాణికుల భయం, భూమిపై ప్రభుత్వాల నిర్ణయాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

Read Also: చచ్చి బతికి పగ తీర్చుకునే జడ్జి… 10 ఏళ్ల టైమ్ ట్రావెల్‌తో అదిరిపోయే కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులో

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×