E-Paper
Advertisement

గుడికో డ్రెస్సు.. పబ్‌కో డ్రెస్సు..’ గుండెనిండా గుడి గంటలు’ జ్యోతిక ఇచ్చిన క్లారిటీ ఇదే!

గుడికో డ్రెస్సు.. పబ్‌కో డ్రెస్సు..’ గుండెనిండా గుడి గంటలు’ జ్యోతిక ఇచ్చిన క్లారిటీ ఇదే!
Advertisement

Gundenninda Gudigantalu jyothika:జ్యోతిక..‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ చూసే టీవీ ఆడియన్స్ కి ఈ పేరు బాగా పరిచయం.ముఖ్యంగా సీరియల్ లో
తన విలనిజంతో జనాల చేత తిట్లు తింటూనే, మరోవైపు నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక తన పర్సనల్ లైఫ్, బాడీ షేమింగ్, కెరీర్ లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నింటిని ఇలా చెప్పుకొచ్చింది.

స్క్రీన్ పై లావు.. బయట మాత్రం స్లిమ్!

జ్యోతిక మాట్లాడుతూ కెమెరా ముందుకు, రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుందని ,చాలామంది నన్ను బయట చూసి ‘స్క్రీన్ మీద కంటే చాలా స్లిమ్ గా ఉన్నావ్’ అని అంటుంటారని చెప్పుకొచ్చింది.ఇక 21-22 ఏళ్ల వయసులో జిమ్‌లో బెల్ట్ పెట్టుకోకుండా ‘ఈగో లిఫ్టింగ్’ (ఎక్కువ బరువులు ఎత్తడం) చేయడం వల్ల నడుముకి గాయమైందని వాపోయింది.

Advertisement

అలా ఆ ఇంజ్యూరీ అవడం వల్ల వాడిన మెడికేషన్స్, డైట్ చేంజెస్ వల్లే బాడీలో మార్పులొచ్చాయని అసలు విషయం చెప్పుకొచ్చింది.ఇక ఈ రోజుల్లో పెద్దగా కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదని జంక్ ఫుడ్ మానెయ్యడమే ఈ రోజుల్లో అతిపెద్ద డైట్ అని నా నమ్మకం అని ఫిట్ నెస్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

అన్నీ ఎంజాయ్ చేస్తా

ఇక నాన్నది చిత్తూరు జిల్లా కుప్పం కాగా, అమ్మమ్మ-తాతయ్యలది తమిళనాడు అని వారు బెంగళూరులో సెటిల్ అవ్వడంతో నాన్న, పెద్దమ్మ అక్కడే పుట్టానని చిన్ననాటి విషయాలని చెప్పుకొచ్చింది.ఇక చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యామని, అందుకే తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు అక్కడి పండుగలు, సాంప్రదాయాలన్నీ బాగా తెలుసని తెలిపింది.

Advertisement

ఇక తెలంగాణ బోనాలు, బతుకమ్మ నుంచి రాయలసీమ వంటకాల వరకు అన్నీ ఎంజాయ్ చేస్తానని తన అభిరుచులని చెప్పుకొచ్చింది జ్యోతిక.

ఇండస్ట్రీలోకి రావడం నాన్నకి అసలు ఇష్టం లేదు

ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ నటిని అవ్వడం నాన్నకి ఏమాత్రం ఇష్టం లేదని కానీ అమ్మే దగ్గరుండి ప్రోత్సహించిందని తెలిపింది.చిన్నప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ క్లాస్‌లో చేర్పించడం దగ్గర నుంచి హైదరాబాద్‌లో ఆడిషన్స్ కి పంపించే వరకు అమ్మే అంతా చూసుకుందని తన తల్లి ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. ఇక 16 ఏళ్ల వయసులో కలర్స్ కన్నడ, జీ తెలుగు ఆడిషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అదొక ట్రిప్‌లా అనిపించిందని,క్రమ క్రమంగా ఇక ఇక్కడే స్థిరపడ్డామని తెలిపింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ మిస్ 

అయితే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ (2022) లో ఒక మంచి రోల్ వచ్చే అవకాశం వచ్చిందని, కానీ సీరియల్ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఆ సినిమాలో తాను చేయలేకపోయానని బాధ పడిపొయింది.
ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. తను చాలా సెలెక్టివ్ అని లైఫ్‌లో కింది స్థాయిలో ఉన్నప్పుడు మనతో ఎవరుంటారో వాళ్ళే మన నిజమైన స్నేహితులని తెలిపింది.

ఎవరికి నచ్చిన బట్టలు వారు

ఇక చాలా మంది సీరియల్‌లో నెగెటివ్ రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో కొందరు పర్సనల్‌గా టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తుంటారని బాధ పడిపోయింది.గుడికి వెళ్లినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, పబ్‌కి వెళ్లినప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. నేరం చేయనంత వరకు ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకోవడంలో తప్పులేదని కుండబద్దలు కొట్టేసింది.

also read :కమిట్‌మెంట్ లేకుండా అవకాశాలు రావా..? ‘భాగ్య రేఖ’ఐశ్వర్య ఏం చెప్పిందంటే!

ఇక పెళ్లి విషయం రాగానే ఇంట్లో కంగారేం లేదని, సరైన సమయం వచ్చినప్పుడు, నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది జ్యోతిక.మొత్తానికి గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో విలనిజంతో భయపెడుతున్న జ్యోతిక చెప్పిన మాటలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×