Hidden battery saving settings: మనం ఫోన్‌ను వాడకపోయినా.. టేబుల్ మీద సైలెంట్‌గా పడుకోబెట్టినా సరే బ్యాటరీ శాతం అటూఇటూ మారుతూ త్వరగా అయిపోతుంటుంది. రాత్రికి రాత్రే 20% నుంచి 30% చార్జింగ్ కరిగిపోవడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అసలు మనం ముట్టుకోకపోయినా ఫోన్ బ్యాటరీ ఎందుకు డ్రైన్ అవుతుంది? దీని వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ కారణం కావచ్చు. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను.. రెట్టింపు చేయడానికి వెంటనే మార్చాల్సిన ఆ 3 ముఖ్యమైన సెట్టింగ్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఏ యాప్‌ను వాడకపోయినా.. అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ డేటాను , బ్యాటరీని పీల్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్, ఈమెయిల్, న్యూస్ యాప్‌లు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటాయి.
ఇలాంటి సమయంలో మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Battery & Device Care’ లేదా ‘Apps’ సెక్షన్‌లో బ్యాక్ గ్రౌండ్ యాప్ యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేయండి. కేవలం అత్యవసరమైన యాప్‌లకు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా చార్జింగ్ చాలా వరకు సేవ్ అవుతుంది.
చాలా యాప్‌లు ఎల్లప్పుడూ మన .. లొకేషన్‌ను ట్రాక్ చేస్తూనే ఉంటాయి. మ్యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్, క్యాబ్ బుకింగ్ యాప్స్ మాత్రమే కాకుండా సాధారణ గేమ్‌లు కూడా లొకేషన్ పర్మిషన్ తీసుకుంటాయి. ఇది ప్రాసెసర్‌పై భారం వేసి బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే.. సెట్టింగ్స్‌లో ‘Location’ ఆప్షన్‌కు వెళ్లి, కేవలం “While using the app” (యాప్ వాడేటప్పుడు మాత్రమే) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అలాగే అనవసరమైన యాప్‌లకు లొకేషన్ పర్మిషన్‌ను పూర్తిగా డిసేబుల్ చేయండి.
మీ గూగుల్ అకౌంట్, ఫోటోలు, కాంటాక్ట్స్ నిత్యం సర్వర్‌తో సింక్ అవుతుంటాయి. దీని వల్ల ఫోన్ ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం వెతుకుతుంది. అలాగే .. ప్రతి చిన్న యాప్ పంపే అనవసరమైన పుష్ నోటిఫికేషన్స్ వల్ల స్క్రీన్ ఆన్ అవుతూ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అందుకే సెట్టింగ్స్‌లో ‘Accounts and Backup’కి వెళ్లి ఆటో-సింక్ ఆప్షన్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి. అలాగే ఫోన్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్ మేనేజ్‌మెంట్‌ను మార్చుకుని, కేవలం ముఖ్యమైన యాప్ నోటిఫికేషన్లను మాత్రమే అనుమతించండి.
Also Read: కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?
1.మీ ఫోన్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ ‘Adaptive Brightness’ లో ఉంచండి.
2.డార్క్ మోడ్ వాడటం ద్వారా బ్యాటరీ వాడకం గణనీయంగా తగ్గుతుంది.
3.అవసరం లేనప్పుడు బ్లూటూత్, వైఫై, హాట్ స్పాట్‌లను ఆఫ్ చేయడం మంచిది.
4.ఈ చిన్న చిన్న సెట్టింగ్ మార్పులు చేయడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా పెరుగు తుంది. తరచూ.. చార్జింగ్ పెట్టాల్సిన టెన్షన్ లేకుండా మీ ఫోన్ బ్యాటరీ రోజంతా వస్తుంది!