OTT Movie Memories of Murder : కొరియన్ సినిమాలు గ్రిప్పింగ్ కథలతో, డీప్ ఎమోషన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ స్టోరీలు, డార్క్ థీమ్స్‌తో అందరినీ ఆకర్షిస్తాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా, టెన్షన్, మిస్టరీ నిండిన సినిమా కావాలంటే, ఇది మీ కోసమే. ఈ సినిమా దక్షిణ కొరియాలోని హ్వాసియోంగ్ సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా రూపొందింది. ఈ థ్రిల్లింగ్ మాస్టర్‌పీస్ ను ఎక్కడ చూడొచ్చో ఓ లుక్కేద్దాం పదండి.
రెండు ఓటీటీలలో
రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘Memories of Murder’. బాంగ్ జూన్-హో దర్శకత్వంలో, కిమ్ క్వాంగ్-రిమ్, షిమ్ జే-మ్యుంగ్, బాంగ్ జూన్-హో రచనతో, సిజె ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2003లో రిలీజైంది. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, MUBI ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఈ సినిమా 2003 గ్రాండ్ బెల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ (బాంగ్ జూన్-హో), బెస్ట్ యాక్టర్ (సాంగ్ కాంగ్-హో) అవార్డులను గెలుచుకుంది. దీని రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ, డార్క్ హ్యూమర్, సాంగ్ కాంగ్-హో నటన 2003లో దీనిని ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి.
కథలోకి వెళ్తే…
1986-1991 మధ్య దక్షిణ కొరియాలోని హ్వాసియోంగ్‌లో జరిగిన నిజమైన సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా రూపొందిన కథ. ఈ సినిమా ఒక గ్రామీణ పట్టణంలో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ యంగ్ అమ్మాయిలపై అఘాయిత్యం చేసి, క్రూరంగా చంపేస్తారు. ఈ కేసును స్థానిక డిటెక్టివ్ పార్క్ డూ-మాన్ (సాంగ్ కాంగ్-హో), అతని పార్ట్‌నర్ చో యాంగ్-గూ (కిమ్ రో-హా) దర్యాప్తు చేస్తారు. పార్క్ అనుభవం లేని డిటెక్టివ్. సాధారణ పద్ధతులతో, అనుమానితులను బలవంతంగా ఒప్పించడం ద్వారా కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు.
సియోల్ నుండి వచ్చిన డిటెక్టివ్ సియో టే-యూన్ (కిమ్ సాంగ్-క్యుంగ్) లాజికల్, సీరియస్ ఇన్వెస్టిగేటర్ ఈ కేసులో చేరతాడు. ఇద్దరూ కలిసి హంతకుడిని పట్టుకోవడానికి పని చేస్తారు. హత్యలు ఒక ప్యాటర్న్‌లో జరుగుతాయి. వర్షం పడిన రాత్రి, ఎరుపు రంగు దుస్తులు ధరించిన అమ్మాయిల్నే టార్గెట్ చేసి చంపుతాడు ఈ కిల్లర్. ఆ టైంలో ఒక రేడియో పాట వినిపిస్తుంది. డిటెక్టివ్‌లు ఎంతోమంది అనుమానితులను దర్యాప్తు చేస్తారు.
వారిలో బేక్ క్వాంగ్-హో (పార్క్ నో-షిక్) అనే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి, పార్క్ హ్యున్-గ్యూ (పార్క్ హే-ఇల్) అనే సాఫ్ట్‌స్పోకెన్ యువకులను అనుమానిస్తారు. సియో టే-యూన్ లాజికల్ ఇన్వెస్టిగేషన్‌పై ఆధారపడితే, పార్క్ డూ-మాన్ తన ఇన్‌స్టింక్ట్‌లను నమ్ముతాడు. దీని వల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. కేసు మరింత జటిలంగా మారుతుంది. దీంతో హత్యలు జరుగుతూనే ఉంటాయి. మరి ఇంతకీ ఆ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? చివరికి వాడిని పట్టుకున్నారా లేదా ? అనేది ఈ సినిమాను చూసి తెలుకోవాల్సిందే.