Coolie Team Take Over Hyderabad Metro: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ‘. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 14న విడుదలకు సిద్దమౌతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచింది టీం. ఆడియో, ట్రైలర్ ఈవెంట్స్ గ్రాండ్గా నిర్వహించారు. మరోవైపు డైరెక్టర్, ప్రధాన నటులంత వరుస ఇంటర్య్వూలు ఇస్తూ మూవీపై హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్లో మూవీ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో ఆడియన్స్ని మరింత ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేసింది. కూలీ ప్రమోషన్స్ ప్రేక్షకులు ముందుకే తీసుకెళ్లింది మూవీ టీం.
మెట్రోలో కూలీ..
ఇందుకోసం మెట్రో రైలును వేదిక చేసుకుంది. అది హైదరాబాద్లో మెట్రో మొత్తం కూలీ పోస్టర్స్ని ప్రదర్శించారు. ఇపుడు హైదరాబాద్ మెట్రో రైళ్లు మొత్తం కూలీ పోస్టర్స్తో దర్శనం ఇచ్చాయి. మూవీ టీం వినూత్న ప్రయత్నం ప్యాసింజర్స్ని బాగా ఆకట్టుకుంది. మేకర్స్ ఆలోచనకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘హైదరాబాద్ మెట్రోని కూలీ కబ్జా చేసింది‘ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా విక్రమ్, లియో వంటి హిట్ చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది.
నాగ్ లుక్ పై ప్రశంసలు
ఇక అనిరుధ్ సంగీతం, రజనీ మ్యానరిజం కూలీ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, రియల్ స్టార్ ఉపేంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా నాగ్ ఈ సినిమా నెగిటివ్ షేడ్లో కనిపించబోతుండటంతో తెలుగులో కూలీ విపరీతమైన బజ్ నెలకొంది. ఇక ట్రైలర్ ఆయన లుక్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. నాగ్ కెరీర్లో ఇది ది బెస్ట్ లుక్, ఈ సినిమా ఆయన కటౌట్ మరింత ప్లస్ అయ్యిందంటున్నారు. ఇన్నాళ్లకు నాగార్జున కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
ఇక ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోలీవుడ్ కల కూలీతో నెరవరతుందని ఇండస్ట్రీ వర్గాల అంత ఆశపడుతున్న. కాగా ఇప్పటి వరకు కోలీవుడ్కి వెయ్యి కోట్ల సినిమా లేదు. ఎన్ని చిత్రాలు వచ్చిన అవి కోలీవుడ్ వరకే బజ్ క్రియేట్ చేశాయి. లోకేష్ కనగరాజ్ కూడా కేవలం తమిళ్ నటులతో సినిమా తీయడంతో.. వెయ్యి కోట్లు సాధిస్తాయని అనుకున్న విక్రమ్, లియో సినిమాలు కూడా కోలీవుడ్ ఆశలు తీర్చలేకపోయాయి. దీంతో ఈ సారి ఇతర ఇండస్ట్రీ స్టార్స్ ఉండటం, పాన్ ఇండియా రేంజ్లో కూలీ బజ్ ఉండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు పక్కా అంటున్నారు. ప్రస్తుతం సౌత్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన కూలీ.. ఆగష్టు 14న బాక్సాఫీసు ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
Also Read: Manchu Vishnu: సైమా స్కాం.. మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన.. ఇకపై నటీనటులకు ఆ నిబంధనలు
#Coolie takes over the Metro trains in Hyderabad! 🤩#CooliePromotions#Coolie releasing worldwide August 14th@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit… pic.twitter.com/b8opbHkURU
— Sun Pictures (@sunpictures) August 6, 2025