E-Paper
Advertisement

ఓటీటీలోకి రాబోతున్న ఉన్మాదం..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రాబోతున్న ఉన్మాదం..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Unmadham Movie: ఓటీటీ ఆదరణ పెరిగిపోయిన తర్వాత దాదాపు చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే విభిన్నమైన జానర్లలో ఆడియన్స్ కు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. పైగా ఫ్యామిలీతో కలిసి నచ్చిన సినిమా.. నచ్చిన సమయంలో చూసే అవకాశం కలిగిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. పైగా ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి మేకర్స్ తీసుకొస్తూ ఉండడం గమనార్హం . మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఉన్మాదం..

ఆ చిత్రం ఏదో కాదు మలయాళ స్టార్ నటుడు కుంచాకో బోబన్(Kunchacko boban) ప్రధాన పాత్రలో నటించిన ఉన్మాదం (Unmadham). కిరణ్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మించారు. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. ఇక అందులో భాగంగానే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ , హిందీ , కన్నడ భాషలో కూడా స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఫుల్ గా సక్సెస్ అయిన ఈ చిత్రం ఇతర భాషల ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

also read:నాగిని సీరియల్ నటిపై భారీ కుట్ర.. నిజాలు బయటపెట్టిన ప్రియుడు!

ఉన్మాదం మూవీ స్టోరీ..

కొంగడ్ పోలీస్ స్టేషన్ లోని కేస్ నంబర్ 174 గురించి హీరో.. తన పై అధికారిని అడగడం.. ఆ ఫైల్ ను ముట్టుకోవడానికి స్టేషన్ లోని ప్రతి ఒక్కరు భయపడడం.. ఈ విషయాన్ని హీరో చెప్పడం .. కథలోని మిస్టరీని పరిచయం చేస్తుంది .ముఖ్యంగా పాతిపెట్టిన ప్రతి నిజానికి తన గొంతును కనుగొనే మార్గం ఉంటుంది అనే క్యాప్షన్ తో గతంలో మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఆరేళ్ల క్రితం జరిగిన ఒక కేసులో పోలీసులు సాధారణంగా అడిగే..”ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ,ఎలా, ఎందుకు” అనే ప్రశ్నలకు లభించిన సమాధానాలలో ఏదీ అనుమానం కలిగించకపోవడమే ఈ కేసులోని అసలు చిక్కుమడి అని పై అధికారి వివరిస్తారు.ఈ కేసును మళ్లీ తిరిగి తోడడం ప్రమాదకరమని, ప్రయత్నించిన వారంతా ఇబ్బందుల్లో పడ్డారని హీరోయిన్ హీరోను హెచ్చరిస్తుంది. అయినా కూడా హీరో ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తాడు.

పక్కా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్..

Advertisement

ఈ విషయం పై అధికారులకు తెలిస్తే ఉద్యోగం పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. ఈ కేసులో దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని కిందిస్థాయి పోలీసులు బలంగా నమ్ముతుంటే.. పై అధికారులు మాత్రం మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటారు. ఒక పంచమి రాత్రి జరిగే భయానక సంఘటనలు, వెంట్రుకవాసిలో చావు నుంచి హీరో తప్పించుకోవడం వంటి థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ఉన్మాదం ఒక పక్కా ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. వెన్నులో వణుకు పుట్టించే హారర్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి సంగీతాన్ని ముజీబ్ మజీద్ అందించారు.

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×