Congress MLC: స్వేచ్చ బ్యూరో: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కీలకమైన హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ,నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు 7 నెలల ముందే మొదలుపెట్టింది. అయితే అధిష్ఠానం మెజార్టీ నేతల అభిప్రాయాల సేకరణ తర్వాతే అధికారిక క్లారిటీ ఇవ్వనుంది.కానీహైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, సర్కారీ నిర్లక్ష్యాన్ని టీవీ డిబేట్లు, సోషల్ మీడియా వేదికగా ఆయన సమర్థవంతంగా ఎండగట్టారు.
అంతేగాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, ప్రతిపక్షాల విమర్శలను, కుట్రలను తిప్పికొట్టడంలో తనదైన శైలిలో నిలిచారు. మరో వైపు విద్యావంతుడు, వృత్తిరీత్యా న్యాయవాది కావడంతో పాటు ముఖ్యమంత్రి అనుచరుడిగా ఉన్న నమ్మకం ఆయనకు కలిసివచ్చిన ప్రధాన అంశాలుగా పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల పార్టీ నేతల సీనియర్లు జూనియర్ అభిప్రాయాలను ఆయన పేరు నే అత్యధికమంది సిఫారసు చేసినట్లు తెలిసింది.
ఇకనల్గొండ–ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఇంకా ఉత్కంఠను కొనసాగిస్తోంది. ఈ సీటుపై కోమటిరెడ్డి సోదరులఅభిప్రాయం అత్యంత కీలకం కానుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల పట్టు దృష్ట్యా, వారి సూచనలు , సమన్వయం ఆధారంగానే తుది అభ్యర్థిని ఖరారు చేయాలని హైకమాండ్ భావిస్తోంది.
Also Read: Apple Smart Glasses.. రికార్డింగ్ ప్రైవసీ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త పేటెంట్!
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం ఫలితం అధికార పార్టీకి మైలేజ్ ఇచ్చేది కావడంతో, ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి స్వయంగా గ్రౌండ్ రిపోర్టులను మానిటరింగ్ చేస్తున్నారు.ఈ ప్రాంతంలోని పట్టభద్రులు, ఉద్యోగులు, యువత ఓటింగ్ సరళిపై నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు సర్వేల ఆధారంగా సీఎం తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిసింది.
మరో వైపు నల్గొండ–ఖమ్మం–వరంగల్ జోన్‌లోనూ సీనియర్ మంత్రులు, సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ స్థానాన్ని మానిటరింగ్ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, తదితర ముఖ్య నేతలకు హై కమాండ్ బాధ్యత ఇవ్వనున్నది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను కూడా ఈ నేతలే ఫైనల్ చేయనున్నట్లు అన్ని భాను వర్గాలు తెలిపాయి.
పార్టీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనే సూత్రం ఆధారంగానే అభ్యర్థుల ఖరారు జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మెజార్టీ నేతల సమీక్ష పూర్తయిన వెంటనే ఢిల్లీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. వీలైనంత వేగంగా అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని, ఇందుకోసం నేతలంతా టీం వర్క్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల జూమ్ మీటింగ్లో సూచించారు.
Also Read: హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!