E-Paper
Advertisement

నాగిని సీరియల్ నటిపై భారీ కుట్ర.. నిజాలు బయటపెట్టిన ప్రియుడు!

నాగిని సీరియల్ నటిపై భారీ కుట్ర.. నిజాలు బయటపెట్టిన ప్రియుడు!
Advertisement

Mouni Roy: నాగిని సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మౌని రాయ్ (Mouni Rai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఈ మధ్య సౌత్ చిత్రాలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ అందాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈమె.. ఇటీవల తన భర్త సూరజ్ నంబియార్ తో విడాకుల వ్యవహారంతో పాటు తన సహ నటుడు అర్జున్ బిజ్లానీతో డేటింగ్ చేస్తోందనే రూమర్స్ రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి సమయంలో మౌనీ రాయ్ పై కుట్ర జరుగుతోందంటూ ఆమె రూమర్డ్ ప్రియుడు అర్జున్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మౌని రాయ్ పై నిత్యం ఏదో ఒక వార్త..

నాగిన్ సీరియల్ తో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీ రాయ్ నటిగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.. బ్రహ్మాస్త్ర , కే జి ఎఫ్ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తెలుగులో వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఐటమ్ సాంగ్స్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో ప్రేమలో పడిన మౌని రాయ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. 2022లో గోవాలో మలయాళీ , బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరూ కొన్నాళ్లు అన్యోన్యంగానే తమ బంధాన్ని సాగించారు. అయితే వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబం, భర్తకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో పంచుకునేవారు.

Advertisement

also read:సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

వార్తలను ఖండించిన అర్జున్ బిజ్లానీ..

అయితే సడన్ గా వీరిద్దరూ తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఆపేశారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అటు సూరజ్ కూడా మౌనీతో ఉన్న ఫోటోలను, వీడియోలను తొలగించాడు. చివరికి అందరూ అనుకున్నదే నిజమయింది. ఇక భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు మౌని రాయ్ అధికారికంగా ప్రకటిస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించద్దంటూ కూడా ఆమె కోరింది. అయితే సూరజ్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే మరొకరితో మౌని డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. నాగిన్ సీరియల్ లో తనతో కలిసి నటించిన అర్జున్ బిజ్లానీతో ఆమె రిలేషన్ లో ఉందంటూ బీ టౌన్ మొత్తం కోడై కూసింది దీనికి తోడు మౌని అర్జున్ కి ముద్దు పెడుతున్న పాత వీడియో కూడా వైరల్ అయింది. వెంటనే వీటిని అర్జున్ ఖండించారు. మా పవిత్ర బంధానికి ప్రేమ అనే కోణాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

మౌని రాయ్ పై కుట్ర జరుగుతోంది – మౌనీ రాయ్

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ.. మౌనీ రాయ్ తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. కొంతమంది ఆమె గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఆమె పరువును తీయడానికే ప్రయత్నం చేస్తున్నారు .మొదట ఆమె లైంగిక సంబంధాల గురించి రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత మద్యం సేవించడం పై ఏదో అన్నారు. నిజానికి అందరూ పార్టీలకు వెళ్తుంటారు. అందరూ సంతోషంగా గడుపుతారు.. ఇది సహజమే కదా.. కానీ ఆమె వెనక ఏదో కుట్ర జరుగుతోంది” అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

Big Stories

Advertisement
×