BigTV English

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT Movie : కొరియన్ డ్రామాలంటే పిచ్చెక్కిపోయే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులోనూ ఇప్పటికే రొమాన్స్, కామెడీ థీమ్‌లతో వచ్చిన కే-డ్రామాలు, సిరీస్ లు ఓటీటీలను ఊపేస్తున్నాయి. అయితే మరోవైపు కొరియన్ ఫుడ్ అంటే కూడా వీళ్ళకు స్పెషల్ అబ్సెషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే కొరియన్ మూవీ అందులోనూ ఫుడ్ థీమ్ తో వచ్చిన ఓ అద్భుతమైన సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాము.


సిరీస్, ఓటీటీ పేరేంటి?

Let’s Eat 2013 సౌత్ కొరియన్ డ్రామా సిరీస్. పార్క్ జూన్-హ్వా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఫుడ్-సెంట్రిక్ స్టోరీలైన్, రొమాంటిక్ కామెడీ ఎలిమెంట్స్‌తో ప్రశంసలు అందుకుంది. రొమాంటిక్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో… 16 ఎపిసోడ్‌లతో సీజన్-1 పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తుంది. Let’s Eat సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ (Netflix), ట్యూబీ (ఫ్రీ విత్ యాడ్స్)లో, సీజన్ 3 వికీలో అందుబాటులో ఉంది. ఇందులో లీ సూ-క్యుంగ్ (లీ సూ-క్యుంగ్), యూన్ డూ-జూన్ (గూ డే-యంగ్), యూన్ సో-హీ (యూన్ జిన్-యీ), షిమ్ హ్యుంగ్-టాక్ (కిమ్ హక్-మూన్)… సీజన్ 2లో సో హ్యున్-జిన్ (బేక్ సూ-జీ), క్వాన్ యుల్ (లీ సాంగ్-వూ)… సీజన్ 3లో బేక్ జిన్-హీ (లీ జీ-వూ) ఇందులో నటించారు. IMDbలో ఈ సిరీస్ కు 7.7 రేటింగ్ ఉంది. ఇందులో పెద్దలకు మాత్రమే అనేలా కొన్ని సీన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త.

స్టోరీలోకి వెళ్తే… 

Let’s Eat (2013) నలుగురు సింగిల్ వ్యక్తుల కథను చూపిస్తుంది. వీరు ఒకే అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో నివసిస్తూ, ఫుడ్ పట్ల ప్రేమ ద్వారా కనెక్ట్ అవుతారు. లీ సూ-క్యుంగ్ (లీ సూ-క్యుంగ్) 33 ఏళ్ల డివోర్సీ. స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడే అమ్మాయి, గొప్ప ఆహారం ముందుంటే చాలు కంట్రోల్ కోల్పోతుంది. ఆమె పొరుగున గూ డే యంగ్ (యూన్ డూ-జూన్) ఫుడ్ బ్లాగర్, ఇన్సూరెన్స్ సేల్స్‌మన్. గొప్ప రెస్టారెంట్లలో ఒంటరిగా భోజనం చేయడానికి ఇష్టపడడు. యూన్ జిన్-యీ (యూన్ సో-హీ) అనే డిజైనర్ స్టూడెంట్, మాజీ రిచ్ గర్ల్… కిమ్ హక్-మూన్ (షిమ్ హ్యుంగ్-టాక్) అనే లాయర్ కు సూ-క్యుంగ్ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి.


జిన్-యీ సూచనతో… వీళ్ళంతా కలిసి డైనింగ్ క్లబ్‌లా భోజనం చేయడం మొదలు పెడతారు. దీనివల్ల వారి జీవితాలు ఇంటర్‌ట్వైన్ అవుతాయి. కథలో ఒక మర్డర్ మిస్టరీతో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. ఇది వారి నార్మల్ లైఫ్‌లో సస్పెన్స్ తెస్తుంది. సూ-క్యుంగ్ డే-యంగ్‌పై అనుమానం పెంచుకుంటుంది. అతని ఐడెంటిటీ గురించి సీక్రెట్స్ రివీల్ అవుతాయి. ఈ సిరీస్ లో రొమాన్స్, కామెడీ, సస్పెన్స్‌తో, ఫుడ్ సీన్స్‌లో కొరియన్ క్యూసిన్ హైలైట్ గా ఉంటాయి.

Let’s Eat 2 (2015)లో డే-యంగ్ (యూన్ డూ-జూన్) సెజాంగ్ సిటీకి మూవ్ అవుతాడు. బేక్ సూ-జీ (సో హ్యున్-జిన్)తో తన పాత స్కూల్‌మేట్‌తో రీయూనైట్ అవుతాడు. ఈ సీజన్ (18 ఎపిసోడ్‌లు) లవ్ ట్రయాంగిల్, ఫుడ్ సీన్స్‌పై ఫోకస్ చేస్తుంది. Let’s Eat 3 (2018)లో డే-యంగ్ (యూన్ డూ-జూన్) తన 30sలో కాలేజ్ ఫ్రెండ్ లీ జీ-వూ (బేక్ జిన్-హీ)తో తన 20s ఫుడ్ మెమరీస్‌ను రివిజిట్ చేస్తాడు. ఈ సీజన్ 14 ఎపిసోడ్‌లు ఉంటుంది.

Read Also : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Related News

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : చనిపోయిన భార్యతో కనెక్ట్ అవ్వడానికి అలాంటి పని… నెక్స్ట్ ట్విస్టుకు గుండె గుభేల్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి హత్య చేసే కిల్లర్… 6 నెలల తరువాత ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి..మూవీ లవర్స్ కు పండగే..!

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Big Stories

×