Tollywood Celebreties : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చిన్న క్యారక్టర్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటుగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంటే ఇండస్ట్రీలోకి ఏదొక పాత్రతో ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ తో వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీ అంటేనే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. ఎప్పుడు ఏ నటుడు ఎలా మారిపోతాడో చెప్పడం కష్టం.. రాత్రికి రాత్రే కొంతమంది నటులు స్టార్ లుగా మారి పోతారు.. మరికొందరు ప్లాప్ సినిమాలతో ఇండస్ట్రీ నుంచి దూరం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ నటీనటులు ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా చిన్నచిన్న పాత్రలు చేసిన వారే.. వారెవరో ఇప్పుడు చూద్దాం..
త్రిష..
ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం కాకముందు జోడి సినిమా లో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది. వర్షం సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది.
విజయ్ దేవరకొండ…
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో సాధారణ యాక్టర్ గా చేశారు.. ఆ తర్వాత ఆయన అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు. ప్రస్తుతం హిట్ మూవీల కోసం వెయిట్ చేస్తున్నాడు. రెండు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి..
సాయి పల్లవి..
ఒకప్పుడు ముఖం మీద మొటిమలతో చూడటానికి అసలు బాగోకుండా ఉన్న సాయి పల్లవి ఇప్పుడు దానిని హీరోలకు ఛాయస్ గా మారింది. అదృష్టం అనేది ఉంటే బండ్లు ఓడలు అవుతాయని నిరూపించింది.
రవితేజ..
మాస్ రాజా రవితేజ ఇండస్ట్రీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ స్నేహితుడిగా గ్రూపులో ఒక్కడిగా రవితేజ ఉన్నారు. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన నీకోసం మూవీ లో రవితేజ హీరోగా మారారు..
విజయ్ సేతుపతి..
ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి, ఒకప్పుడు ధనుష్, కార్తి,జయం రవి హీరోలుగా చేసిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు..
ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలోని చాలా మంది ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా పలు పాత్రల్లో నటించి ఇప్పుడు అదృష్టం మారి స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు. నవీన్ పొలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించారు. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చిన్న రోల్ పోషించారు సత్యదేవ్. అలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, తర్వాత హీరో గా మారాడు. చివరగా హీరో శర్వానంద్ కూడా.. యువసేన మూవీ లో నలుగురు హీరోల్లో ఒకడిగా పరిచయమైన శర్వానంద్, ఆ తర్వాత చాలా సైడ్ క్యారెక్టర్లు చేసి, హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.