E-Paper
Advertisement

అండర్‌వరల్డ్ డాన్‌గా మారే కబడ్డీ ఆటగాడు… ఈ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

అండర్‌వరల్డ్ డాన్‌గా మారే కబడ్డీ ఆటగాడు… ఈ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే
Advertisement

Crime Thriller Web Series : జియోహాట్‌స్టార్‌లో సరికొత్తగా విడుదలైన తమిళ్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘లింగం’ (Lingam). ఒక కబడ్డీ ఆటగాడు ఎలా అండర్‌వరల్డ్ కింగ్‌పిన్ అయ్యాడు? సాధారణ యువకుడి జీవితం ఎలా ఒక్కసారిగా మారిపోయి, అతన్ని క్రూరమైన అండర్‌వరల్డ్ డాన్‌గా మార్చిందనే ఉత్కంఠభరితమైన కథే ఈ మూవీ. పగ, ప్రతీకారం, రాజకీయ కుట్రలు, యాక్షన్ నిండిన ఈ సిరీస్ తమిళ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోందా ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? సిరీస్ కంప్లీట్ స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

లింగం (కతీర్) ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. అతని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుండి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది అతని ఏకైక కల. అంతేకాకుండా అతను ఒక అద్భుతమైన కబడ్డీ ఛాంపియన్ కూడా. అతని పోలీస్ సెలక్షన్ కొద్దిగా ఆలస్యం కావడంతో, ఒక పెద్ద కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొంటాడు. ఆ టోర్నమెంట్ కాస్తా తీవ్రమైన హింసకు దారి తీస్తుంది. ఆ గొడవలో ఒక షాకింగ్ హత్య జరుగుతుంది. ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా, లింగంపై తప్పుడు నింద మోపి పోలీసులు అరెస్ట్ చేస్తారు.

Advertisement

జైల్లో అతన్ని దారుణంగా హింసిస్తారు. ఆ చిత్రహింసలు, సమాజం చేసిన అన్యాయం అతని మనసును పూర్తిగా మార్చేస్తాయి. శాంతంగా ఉండే ఒక క్రీడాకారుడు మెల్లగా ఒక క్రూరమైన, భావోద్వేగాలు లేని వ్యక్తిగా మారిపోతాడు. జైలు నుండి బయటకు వచ్చాక పోలీసులు అతడిని ప్రతి చిన్న నేరానికి టార్గెట్ చేస్తుంటారు. స్థానిక రౌడీలు కూడా అతడిని వాడుకోవాలని చూస్తారు. దాంతో విసిగిపోయిన లింగం, చెల్లపాండియన్ అనే వ్యక్తి అక్రమ మద్యం సామ్రాజ్యంలో చేరతాడు. తన తెలివితేటలతో ఆ బిజినెస్‌ను భారీగా విస్తరింపజేసి, తన బాస్‌ ను ఒక డేంజరస్ దాడి నుండి కాపాడి, అతని నమ్మకాన్ని గెలుచుకుంటాడు.

ఆ తర్వాత జరిగిన రాజకీయ కుట్రలు, ద్రోహాల వల్ల చెల్లపాండియన్ చనిపోతాడు. తన బాస్ మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ, కన్యాకుమారి మొత్తానికి తిరుగులేని అండర్‌ వరల్డ్ డాన్‌గా లింగం ఎలా ఎదిగాడు ? అనేదే ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ కథాంశం. కతీర్ అద్భుతమైన యాక్షన్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పగ, ప్రతీకారం, యాక్షన్ లు బాగుంటాయి. ‘లింగం’ ప్రస్తుతం JioHotstarలో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా ఈ సిరీస్ ను హాట్ స్టార్ లో చూడవచ్చు.గ్యాంగ్‌స్టర్ రివెంజ్ డ్రామా ఇష్టపడేవారు ఈ వీకెండ్ సిరీస్ పై ఒక లుక్కేయండి. జియో హాట్‌స్టార్ లో ఈ సిరీస్‌ను ఒరిజినల్ తమిళ్ భాషతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు నేరుగా తెలుగు డబ్బింగ్ వర్షన్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ గ్యాంగ్‌స్టర్ రివెంజ్ డ్రామాను వీక్షించవచ్చు.

Advertisement

Read Also : పని మనిషిగా వచ్చి ఇవేం పాడు పనులు… ఆస్కార్ విన్నింగ్ కొరియన్ డార్క్ కామెడీ థ్రిల్లర్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×