E-Paper
Advertisement

పని మనిషిగా వచ్చి ఇవేం పాడు పనులు… ఆస్కార్ విన్నింగ్ కొరియన్ డార్క్ కామెడీ థ్రిల్లర్

పని మనిషిగా వచ్చి ఇవేం పాడు పనులు… ఆస్కార్ విన్నింగ్ కొరియన్ డార్క్ కామెడీ థ్రిల్లర్
Advertisement

Korean Thriller : ఓటిటి మూవీ లవర్స్ కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఆస్కార్ విన్నింగ్ మూవీని తీసుకొచ్చాము. నిజానికి ఈ మూవీ ఏడేళ్ళ క్రితం సృష్టించిన సంచలనం అంతా కాదు. కానీ ఆ తర్వాత ఎన్నో సినిమాలు తెరపైకి రావడంతో దాదాపు మూవీ లవర్స్ అందరూ ఈ సినిమాను మర్చిపోయి ఉంటారు. కానీ ఈ మూవీ ఆస్కార్ అవార్డులో చరిత్రలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి ఆంగ్లేతర సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఆ మూవీనే ‘పారాసైట్’ (Parasite – 2019). ప్రసిద్ధ దర్శకుడు ‘బాంగ్ జూన్-హో’ ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మొదట్లోనే కిమ్ కుటుంబాన్ని పరిచయం చేస్తారు. కిమ్ కీ-టెక్ (తండ్రి), చుంగ్-సూక్ (తల్లి), కీ-వూ (కొడుకు), కీ-జంగ్ (కూతురు) అనే నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ అది. ఒక చిన్న, అట్టడుగున ఉండే సెమీ-బేస్‌మెంట్ ఇంట్లో నివసిస్తుంటారు. వీరికి సరైన ఉద్యోగాలు ఉండవు. పిజ్జా బాక్సులు మడతపెడుతూ చాలా పేదరికంలో బతుకుతుంటారు. అలాంటి సమయంలో కొడుకు కీ-వూ స్నేహితుడు ఒకరు.. తాను విదేశాలకు వెళ్తున్నానని, తన స్థానంలో ‘పార్క్’ అనే ఒక అత్యంత ధనిక కుటుంబంలోని అమ్మాయికి ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పే ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. దీనికోసం కీ-వూ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఆ ధనిక ఇంట్లో అడుగుపెడతాడు.

Advertisement

ఆ ఇంట్లోకి వెళ్ళిన కీ-వూ, ఆ ధనిక దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన కుటుంబ సభ్యులందరినీ ఒక్కొక్కరిగా ఆ ఇంట్లోకి చేర్చడానికి ప్లాన్ వేస్తాడు. తన చెల్లి కీ-జంగ్‌ను ఒక పెద్ద ఆర్ట్ థెరపిస్ట్‌గా పరిచయం చేసి, ఆ ఇంటి చిన్న బాబుకు ట్రైనర్‌గా జాయిన్ చేయిస్తాడు. ఆ తర్వాత ఒక పెద్ద కుట్ర ద్వారా ఆ ఇంట్లో ఇన్నాళ్లుగా పని చేస్తున్న కార్ డ్రైవర్‌ను, హౌస్ కీపర్ మూన్-గ్వాంగ్‌ను అబాండాలు వేసి ఉద్యోగాల నుండి తీయించేస్తారు. వారి స్థానంలో తన తండ్రిని డ్రైవర్‌గా, తల్లిని కొత్త హౌస్ కీపర్‌గా చేర్పిస్తాడు.

అయితే, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పార్క్ కుటుంబానికి తెలియదు. ఒకరోజు పార్క్ కుటుంబం మొత్తం వీకెండ్ క్యాంపింగ్‌కు వెళ్తుంది. ఇల్లు ఖాళీగా ఉండటంతో కిమ్ కుటుంబం అంతా ఆ లగ్జరీ ఇంట్లో మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. పాత పనిమనిషి రాకతో కథ మలుపు తిరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో, ఉద్యోగం నుండి తీసేసిన పాత పనిమనిషి మూన్-గ్వాంగ్ వర్షంలో తడుస్తూ అక్కడికి వస్తుంది. తాను ఒక వస్తువును బేస్‌మెంట్‌ లో మర్చిపోయానని, లోపలికి వెళ్లాలని బ్రతిమాలుతుంది.

Advertisement

ఆమె వెనుక వెళ్లిన కిమ్ కుటుంబానికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ ఇంటి క్రింద ఎవరికీ తెలియని ఒక రహస్య భూగర్భ బంకర్ ఉంటుంది. అప్పుల బాధ తట్టుకోలేక మూన్-గ్వాంగ్ తన భర్తను గత నాలుగేళ్లుగా ఆ చీకటి బంకర్‌లోనే దాచిపెట్టి రహస్యంగా ఆహారం అందిస్తూ సాకుతోంది. కిమ్ కుటుంబం రహస్యం ఆ పాత పనిమనిషికి, ఆమె రహస్యం వీరికి తెలిసిపోవడంతో ఇరువర్గాల మధ్య భీకరమైన గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో పాత పనిమనిషి మెట్లపై నుండి పడి తీవ్రంగా గాయపడి, బంకర్‌లోనే చనిపోతుంది. ఆమె భర్తను అక్కడే కట్టేస్తారు. ఇంతలో, వర్షం కారణంగా క్యాంపింగ్ క్యాన్సిల్ అవ్వడంతో పార్క్ కుటుంబం అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వస్తుంది. ఇలాంటి సమయంలో కిమ్ కుటుంబం ఆ పాత పని మనిషి శవాన్ని ఏం చేసింది ? ఆ తరువాత ఆ ఇంట్లో జరిగిన గందరగోళం ఏంటి ? మైండ్ బెండయ్యే క్లైమాక్స్ ఏంటి ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం SonyLIV, Amazon Prime Videoలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

రైతు కొడుకు నుంచి పూణే డాన్‌గా… షాకింగ్ క్రైమ్ డ్రామా

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం

అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్‌కి ఇంత ఘోరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందా? ఈ మూవీని డోంట్ మిస్

ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్

హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు

25 ఏళ్లుగా ప్రాణాలతో చెలగాటం… జాకాస్ గ్యాంగ్‌కు ఎమోషనల్ ఫేర్‌వెల్

చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్

Big Stories

Advertisement
×