OTT Movie : కొన్ని స్టోరీలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అంతేకాదు ఒక్కోసారి మనల్ని గుర్తుకు చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ముంబై చౌల్‌లోని ఆటో డ్రైవర్ తో మొదలవుతుంది. ఒక చిన్న రూమ్‌లో కుటుంబసభ్యులను డైవర్ట్ చేస్తూ, భార్యతో గడపడానికి ఈ ఆటో వాడు పడే బాధలు కామెడీతో పాటు, ఎమోషన్ గా కూడా ఆకట్టుకుంటాయి. ఒక మైండ్ రిఫ్రెష్ మూవీగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ ఈ సినిమాని చూడకపోతే ఓ లుక్ వేయండి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
సినిమా ముంబైలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలోని శుక్లా అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. శుక్లా ఒక ఆటో డ్రైవర్, అతను తన మొబైల్ స్క్రీన్‌లో సినిమా హీరోయిన్‌లను చూస్తూ, బాడీలో వేడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే వేడి పెరుగుతుందేగాని తగ్గట్లేదు అయ్యగారికి. అతని కుటుంబంలో అతనితో పాటు అతనితల్లి, తండ్రి, సోదరి ఒక చిన్న రూమ్ లో నలుగురు కలిసి నివసిస్తుంటారు. ఈ కారణంగా ప్రైవసీ అంటే వారికి ఏమీ లేదు. కేవలం తండ్రి పెట్టిన పాత సూట్‌కేసులు మాత్రమే ఒక గోడగా పనిచేస్తాయి. ఒకరోజు శుక్లా తల్లి ఎలాగో అతనికి మ్యారేజ్ అరేంజ్ చేస్తుంది. చూస్తుండగానే పెళ్లి కూడా జరిగిపోతుంది.
అతని భార్య రాణి ఒక గ్రామీణ అమ్మాయి. ఆమెకు కూడా రిలేషన్‌షిప్ అనుభవాలు పెద్దగా లేవు. పెళ్లి తర్వాత ఈ జంట అదే రూమ్‌లో కలిసి ఉండాల్సి వస్తుంది. కానీ కుటుంబం చుట్టూ ఉండటం వల్ల ప్రైవసీ దొరకదు. శుక్లా తన భార్యను సంతోషపెట్టాలని, వారి మధ్య ఇంటిమసీ బిల్డ్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ప్లేస్, ప్రైవసీ దొరక్కపోవటంతో ఇక ఆపనికి ఇబ్బంది పడుతుంటాడు. అంతేకాకుండా మొబైల్‌లో చూసిన సినిమాలు మాత్రమే అతని “ఎక్స్‌పీరియన్స్”, కానీ రియల్ లైఫ్‌లో అతను ఆపనికి భయపడతాడు. అసహాయంగా ఉంటాడు.
ఈ సమయంలో సమస్యలు మరింత పెరుగుతాయి. శుక్లా సోదరి తన భర్తతో గొడవ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఇది రూమ్ మరింత క్రౌడెడ్ చేస్తుంది. కుటుంబం మొత్తం వారి ప్రైవేట్ మూమెంట్స్‌ను డిస్టర్బ్ చేస్తుంది. ఇక శుక్లాకి ఏడుపు ఒక్కటే తక్కువగా ఉంటుంది. కథలో ఎమోషనల్ లేయర్స్ బయటకి వస్తాయి. శుక్లా తన భార్యను ప్రేమిస్తాడు, కానీ అతని ఇన్‌ఎక్స్‌పీరియన్స్, సోషల్ ప్రెషర్ అతన్ని టెన్షన్‌లో ఉంచుతాయి. రాని కూడా ఆమె పట్ల అతని కేర్‌ను గమనిస్తుంది. క్లైమాక్స్‌లో శుక్లా కుటుంబాన్ని కన్విన్స్ చేసి, కొంచెం ప్రైవసీ స్పేస్ తో వారి మధ్య ఇంటిమసీ బిల్డ్ చేస్తాడు. మరి శుక్లాకి ఆ కార్యక్రమం కూడా జరిగిపోతుందా ? లేక మరేమైనా సమస్యలు వస్తాయా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
‘లవ్ అండ్ షుక్లా’ (Love and Shukla) ఒక హిందీ కామెడీ డ్రామా చిత్రం. జత్లా సిద్ధార్థ దర్శకత్వంలో, పానరామా స్టూడియోస్ నిర్మించింది. ఇందులో సహర్ష్ కుమార్ షుక్లా (షుక్లా), తనీయా రాజవత్ (లక్ష్మి, షుక్లా భార్య), హిమా సింగ్ (రూపా, షుక్లా సిస్టర్), అపర్నా ఉపాధ్యాయ్ (షుక్లా అమ్మ), లోక్‌నాథ్ తివారీ (షుక్లా తండ్రి) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 40 నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. 2018 మార్చి 11న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
Read Also : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్