BigTV English

OTT Movie : డేటింగ్ యాప్ కోసం అమ్మాయి ఆరాటం… కితకితలు పెట్టే కామెడీ రొమాంటిక్ డ్రామా

OTT Movie : డేటింగ్ యాప్ కోసం అమ్మాయి ఆరాటం… కితకితలు పెట్టే కామెడీ రొమాంటిక్ డ్రామా

OTT Movie : రొమాంటిక్ సినిమాలను చూడటానికి యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులోనూ హాలీవుడ్ సినిమాలలో ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రీసెంట్ గానే ఓటిటిలోకి వచ్చింది. ఇందులో ఒక డేటింగ్ రియాలిటీ షోలో చిక్కుకున్న యువతి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆమె ప్రేమ, కెరీర్ మధ్య ఎదో ఒక ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీ ఏమిటంటే

డాన్ అనే యువతి టెక్సాస్‌లోని ఒక చిన్న టౌన్‌లో మెటల్‌స్మిత్ ఆర్టిస్ట్. పారిస్ లో ఆర్ట్ స్కూల్‌కు అడ్మిషన్ పొందుతుంది. కానీ అక్కడ జీవించడానికి ఆమె దగ్గర డబ్బు లేకపోవడంతో ఆలోచనలో పడుతుంది. ఆమె పాపులర్ డేటింగ్ రియాలిటీ షో “ది హనీపాట్”లో పాల్గొని డబ్బు గెలవాలని నిర్ణయించుకుంటుంది. ఈ షో పారిస్ లో జరుగుతుందని అనుకుంటుంది. కానీ ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు, అది టెక్సాస్‌లోని రాంచ్‌లో జరుగుతుందని తెలుస్తుంది. డాన్ షో నుండి ఎలిమినేట్ అయ్యే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఆమె పారిస్ లోనే ఉండాలని అనుకుంటుంది. కానీ ఇంతలోనే ట్రే అనే ఒక బ్యాచిలర్ స్టోరీలో ఎంట్రీ ఇస్తాడు. ఆమెతో ఫ్లర్ట్ చేసి ముగ్గులో దింపుతాడు.

మరోవైపు డాన్ రూమ్‌మేట్స్‌ అయిన లెక్సీ, జాస్మిన్ ఆమెకు సపోర్ట్ చేస్తారు. షో ప్రొడ్యూసర్ కూడా డాన్‌కు సహాయం చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో, డాన్ ట్రే మధ్య స్పార్క్స్ ఫ్లై అవుతాయి. షో చాలెంజెస్ ద్వారా వారి రిలేషన్‌షిప్ డెవలప్ అవుతుంది. కానీ డాన్ పారిస్ డ్రీమ్ ను సాధించాలా ? టెక్సాస్ లో ట్రేతో కలసి ఉండాలా ? అనే సందేహంలో పడుతుంది. ఈ రెండిటి మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్లైమాక్స్‌లో డాన్ తన డ్రీమ్‌ను వదులుకుంటుందా ? ట్రే తో రొమాన్స్ చేస్తుందా ? లేకపోతే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుందా ? అనే విషయాలను ఈ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.


నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

‘ది రాంగ్ పారిస్’ (The Wrong Paris) 2025లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. జానీన్ డేమియన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మిరాండా కాస్‌గ్రోవ్ (డాన్) పియర్సన్ ఫోడ్ (ట్రే) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 12 నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.

Read Also : దొంగ పేర్లతో అమ్మాయిలతో ఆడుకునే సైకో… హీరోనే విలన్ అయితే… మైండ్ బెండయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : పెళ్ళైనా తీరని కోరిక… భార్యాభర్తలిద్దరిదీ అదే పరిస్థితి… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : ఈ మూవీ ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది ? గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

Big Stories

×