OTT Movie : సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ లో పోటీ పడుతున్నాయి. కొత్త కొత్త పంధా లతో ఈ స్టోరీలు తెరకెక్కుతున్నాయి. దిమ్మ తిరిగే క్లైమాక్స్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కొన్ని యానిమేషన్ సిరీస్ ల సమూహారం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక సిరీస్ కాకుండా చాలా సిరీస్ లు ఉంటాయి. వీడియో గేమ్ లా ఈ సిరీస్ మిమ్మల్ని పిచ్చెక్కిస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netfix)లో
ఈ వెబ్ సిరీస్ పేరు ‘లవ్, డెత్ &రోబోట్స్’ (Love, Death & Robots). ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netfix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక అడల్ట్ యానిమేటెడ్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. ఇది టిమ్ మిల్లర్, డేవిడ్ ఫిన్చర్ చేత సృష్టించబడింది. ఈ సిరీస్ వివిధ జానర్‌లలోని చిన్న చిన్న యానిమేటెడ్ కథల సమాహారం అని చెప్పుకోవచ్చు. ఇందులో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హారర్, కామెడీ వంటివి ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ వేర్వేరు యానిమేషన్ స్టూడియోలచే తయారు చేయబడింది. విభిన్న స్టోరీలతో ఈ సిరీస్ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ‘ప్రేమ’ (Love), ‘మరణం’ (Death), ‘రోబోట్స్’ ) అనే మూడు ఫార్మాట్‌లను కలిపి ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో ఒకే ఒక్క కథాంశం అంటూ ఏమీ లేదు. కానీ ప్రతి ఎపిసోడ్ ఒక ఇండిపెండెంట్ స్టోరీని అందిస్తుంది. మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది.
స్టోరీలోకి వెళితే
‘Three Robots’: ఈ ఎపిసోడ్‌లో మానవజాతి అంతరించిపోయిన తర్వాత, ముగ్గురు రోబోట్‌లు, ఒక అపోకలిప్టిక్ నగరంలో సందర్శించడానికి వెళతాయి. మానవుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇది చూడటానికి హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా ఉంటుంది.
‘Sonnie’s Edge’: భవిష్యత్తులో సోనీ అనే యువతి తన ‘బీస్టీ’ని ఉపయోగించి భూగర్భ పోరాటాలలో పాల్గొంటుంది. ఈమె చేసే పోరాటాలు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయి. ఈ కథలో మైండ్ బ్లాక్ అయ్యే ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంటుంది.
‘Zima Blue’: ఒక ప్రసిద్ధ కళాకారుడు తన అనుభవాలను, తన చివరి రచనలో వెల్లడిస్తాడు. ఇది ఆలోచనాత్మకంగానే కాకుండా, లోతైన అర్థంతో నిండి ఉంటుంది. ఈ స్టోరీ ఒక కళాకారుడు చుట్టూ తిరుగుతుంది.
ఇలా ప్రతి ఎపిసోడ్ యానిమేషన్ శైలిని కలిగి ఉంటుంది. 5 నుండి 15 నిమిషాల వరకు ఒక్కో ఎపిసోడ్ ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం మూడు వాల్యూమ్‌లుగా విడుదలైంది. నాల్గవ వాల్యూమ్ కూడా తొందరలో రాబోతోంది. ఇది 1981 లో వచ్చిన ‘Heavy Metal’ అనే యానిమేటెడ్ సినిమా రీఇమాజినేషన్‌గా ప్రారంభమైంది. కానీ తర్వాత నెట్‌ఫ్లిక్స్ కోసం ఇది ఆంథాలజీ ఫార్మాట్‌లోకి మారింది. మీరు ఈ సిరీస్ ని చూడటం మొదలు పెడితే చివరి వరకూ ఆపకుండా చూస్తూనే ఉంటారు. అంతలా మిమ్మల్ని ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది.