E-Paper
Advertisement

OTT Movie : సమ్మర్ లో సెగలు రేపే మూవీ… చాలా దేశాలలో బ్యాన్ చేసిన సినిమా సింగిల్స్ కోసమే!

OTT Movie : సమ్మర్ లో సెగలు రేపే మూవీ… చాలా దేశాలలో బ్యాన్ చేసిన సినిమా సింగిల్స్ కోసమే!
Advertisement

OTT Movie : మీరు సింగిల్‌గా ఉంటున్నారా? ఏదైనా మాంచి సినిమా చూడాలని అనుకుంటున్నారా? అయితే, మీకు తప్పకుండా ఈ సినిమా నచ్చేస్తుంది. చాలామందికి ఇలాంటి సినిమాలు చూడడం ఇష్టమే అయినప్పటికీ మొహమాటానికి అస్సలు వాటి జోలికి పోరు. ఇంట్లో ఎవరూ లేకపోతే మాత్రం హ్యాపీగా చూస్తారు. అలా బో*ల్డ్ సీన్స్ ఉండే సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. పక్కా అలాంటి కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…
లౌ (క్రిస్టెన్ స్టీవర్ట్) ఒక జిమ్ మేనేజర్. ఒంటరిగా జీవిస్తూ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తండ్రి లౌ సీనియర్ (ఎడ్ హారిస్) ఒక క్రిమినల్ లార్డ్. ఆయుధాల స్మగ్లింగ్ మాత్రమే కాదు హత్యలు కూడా చేస్తాడు. లౌ తన సోదరి బెత్ (జెనా మలోన్) గురించి టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఆమె భర్త జేజే (డేవ్ ఫ్రాంకో) ఆమెను టార్చర్ చేస్తాడు.

Advertisement

ఇక మరోవైపు జాకీ (కాటీ ఓ’బ్రియన్) ఒక బాడీబిల్డర్. లాస్ వెగాస్‌లో జరిగే ఒక పోటీ కోసం ప్రయాణిస్తూ ఉంటుంది. ఆమె లౌ జిమ్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే వీరిద్దరూ ప్రేమలో పడడానికి ఎక్కువ టైమ్ పట్టదు. ఇక ఆ ప్రేమ కొన్ని రోజుల్లోనే ముదురుతుంది. కానీ జాకీ స్టెరాయిడ్స్ ఉపయోగించడం మొదలు పెట్టడంతో కథ మలుపు తిరుగుతుంది. ఒక దారుణమైన సంఘటనలో జాకీ జేజేను చంపేస్తుంది. దీంతో లౌ, జాకీ నేర కుటుంబంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. మరి చివరికి ఈ ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ ఏమైంది? జాకీ చేసిన హత్య ఫలితం ఏంటి? లౌ గతం ఏంటి? స్టెరాయిడ్స్ వాడకం లౌ జీవితంపై ఎలాంటి ఎఫెక్ట్ ను చూపించింది? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశాలు.

ఇండియాలో ఏ ఓటీటీలో ఉందంటే?
లెస్బియన్ స్టోరీ కాబట్టి ఈ మూవీ అన్ని దేశాలలో అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. ఇక ఈ మూవీ పేరు “లవ్ లైస్ బ్లీడింగ్” (Love Lies Bleeding). 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ రోజ్ గ్లాస్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో క్రిస్టెన్ స్టీవర్ట్, కాటీ ఓ’బ్రియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 1989లో న్యూ మెక్సికోలోని ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. నేరాలు, అబ్సెషన్, హింసతో నిండిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×