Korean Horror Comedy: కొరియన్ సిరీసులంటే చెవి కోసుకుంటారా ? అందులోనూ థ్రిల్లర్లు అంటే తెగ చూస్తారా ? అయితే ఈ సిరీస్ మీ కోసమే. ఇందులో హీరో హీరోయిన్ కు వింత వింత పరిస్థితులు ఎదురవుతాయి. హీరోయిన్ అదృష్టాన్ని హీరో లాగేసుకుంటాడు. దీంతో హీరోయిన్ తలపై దారిద్ర్య దేవత తాండవం చేస్తుంది. అయినప్పటికీ హీరోయిన్ ఏం రాస్తే అదే హీరో జీవితంలో జరుగుతుంది. వినడానికి థ్రిల్లింగ్ గా ఉన్న ఈ సిరీస్ పేరు ‘లవ్లీ హారిబ్లీ’ (Lovely Horribly). 2018లో విడుదలైన ఈ సిరీస్ ప్రేమ, హారర్, కామెడీ, ట్విస్టుల మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సౌత్ కొరియన్ రొమాంటిక్-కామెడీ హారర్ థ్రిల్లర్… ఒక సూపర్ స్టార్ నటుడు, ఒక దురదృష్టవంతురాలైన స్క్రిప్ట్ రైటర్ మధ్య జరిగే వింతైన బంధం చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ రెండు భిన్నమైన వ్యక్తుల జీవితాలను ఒక వింతైన లంకెతో ముడిపెడుతుంది. ఫిలిప్ యూ సూపర్ స్టార్ నటుడు. అతని జీవితం అన్ని విషయాల్లోనూ లక్కీగా ఉంటుంది. అతనికి ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది. అతను ఎప్పుడూ సంతోషంగా, సక్సెస్ ఫుల్ గా ఉంటాడు.
ఇక హీరోయిన్ ఓ ఉల్-సూన్ డ్రామా స్క్రిప్ట్ రైటర్. ఆమె జీవితం మాత్రం దురదృష్టంతో నిండి ఉంటుంది. ఏ పని చేసినా ఫెయిల్ అవుతుంది, ప్రేమలోనూ ఓడిపోతుంది. ఆమె రాసిన స్క్రిప్టులు కూడా దొంగతనానికి గురవుతాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే… వీరిద్దరూ ఒకే రోజు, ఒకే సమయానికి జన్మిస్తారు. వారి జాతకాలు ఒక వింతైన “జీరో-సమ్ గేమ్” లాంటి లంకెతో ముడిపడి ఉంటాయి. అంటే, ఒకరి జీవితంలో అదృష్టం వస్తే, అది ఆటోమేటిక్‌గా అవతలి వ్యక్తికి దురదృష్టాన్ని లేదా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
చిన్నతనంలో ఫిలిప్ అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉన్నప్పుడు, ఒక షామన్ ఉల్-సూన్ జాతకంలోని అదృష్టాన్ని దొంగిలించి ఫిలిప్ కు ఇస్తాడు. దాంతో ఫిలిప్ పెద్దయ్యాక అంతర్జాతీయ గుర్తింపు ఉన్న టాప్ స్టార్ అవుతాడు. అదే సమయంలో ఉల్-సూన్ మాత్రం రాసే కథలు దొంగిలించబడి, ప్రతి విషయంలోనూ నష్టపోతూ దరిద్రంలో బతుకుతుంది. కథలో ట్విస్ట్ ఏమిటంటే, ఉల్-సూన్ తన స్క్రిప్ట్ లో ఏ సన్నివేశం రాస్తే.. అది మరుసటి రోజు నిజ జీవితంలో ఫిలిప్ కు రియల్‌గా జరగడం మొదలవుతుంది.
స్క్రిప్ట్‌లో మరణాలు, ప్రమాదాలు రాసినప్పుడల్లా ఫిలిప్ ప్రాణాల మీదకు వస్తుంది. ఇది హారర్ ఎలిమెంట్ ను సిరీస్‌లోకి తీసుకొచ్చి, కథను మరింత ఉత్కంఠభరితంగా చేస్తుంది. చివరికి ఇద్దరూ ఒకరినొకరు కాపాడుకుని తమ వింత శాపం నుండి ఎలా విముక్తి పొందారు ? అసలు హీరోహీరోయిన్లకు ఈ విషయం గురించి ఎలా తెలిసింది ? గత జన్మల రహస్యాలు ఏంటి ? ఫిలిప్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ దెయ్యంగా మారి ఎందుకు వెంటాడుతోంది ? ఉల్-సూన్ రాసే స్క్రిప్ట్ వెనుక ఉన్న అతీంద్రియ శక్తులు ఏమిటి ? అనేదే ఈ సిరీస్ లో చూడాల్సిన మిగతా కథ. 16 ఎపిసోడ్ల సిరీస్ ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. ‘లవ్లీ హారిబ్లీ’ ప్రస్తుతం Amazon MX Playerలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు, కానీ ఒరిజినల్ కొరియన్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.
Read Also: ఆచారం పేరుతో ఆడపిల్లల్ని చంపి బావిలో పాతరేసే ఊరు… కట్ చేస్తే గుండెలు జారిపోయే సీన్లు