E-Paper
Advertisement

 మనుషుల్ని చంపి ఐకానిక్ పెయింటింగులుగా మార్చే కిల్లర్… ‘M4M’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

 మనుషుల్ని చంపి ఐకానిక్ పెయింటింగులుగా మార్చే కిల్లర్… ‘M4M’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

M4M OTT : హైదరాబాద్ నగరాన్ని భయంతో కంపించేలా చేసే సీరియల్ కిల్లర్… పాపులర్ పెయింటింగ్‌లను హత్యల ద్వారా రీక్రియేట్ చేస్తూ భయానక కళాకృతులు సృష్టించే సైకో… ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘M4M: Motive for Murder’. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది. జూన్ 19 నుంచి Lionsgate Playలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించగా, నిర్మాతగా కూడా ఆయనే పని చేశారు. జో శర్మా, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. సుభలేఖ సుధాకర్, సత్య కృష్ణన్, గీతా భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. జో శర్మా డెబ్యూట్ ఫిల్మ్ ఇదే. ఈ చిత్రంలో ఆమె నటనకు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఐదు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి.

కథలోకి వెళ్తే…

హైదరాబాద్‌లో ఒక సీరియల్ కిల్లర్ హత్యలను కళాకృతులుగా మారుస్తూ ఉంటాడు. ప్రసిద్ధ పెయింటింగ్‌లను అనుకరిస్తూ భయంకరమైన హత్యలు చేస్తుంటాడు. ACP కృష్ణ (సంబీత్ ఆచార్య), క్రైమ్ జర్నలిస్ట్ రాధ (జో శర్మా) ఈ కేసును దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు సాగుతుండగా బ్యాన్ అయిన పుస్తకం “M4M” కథలోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే మాజీ విద్యార్థి, పాఠశాల ప్రిన్సిపాల్ లపై అనుమానాలు రేకెత్తుతాయి. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి క్లూ ఒక కొత్త సీక్రెట్ ను బయట పెడుతుంది. ఇంతకీ ఈ కిల్లర్ ఎవరు ? అతని నిజమైన మోటివ్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Advertisement

జో శర్మా ఈ సినిమా గురించి మాట్లాడుతూ “ఈ సినిమా నా కెరీర్‌లోనే అత్యంత సంతృప్తికరమైన అనుభవం. కథ విన్నప్పటి నుంచి దాని ఒరిజినాలిటీ, సైకలాజికల్ సస్పెన్స్, హూడనిట్ ఎలిమెంట్స్ అన్నీ ఆకర్షించాయి. రాధ పాత్ర చాలా చాలెంజింగ్. ప్రతి క్లూ ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతుంది. దర్శకుడు మోహన్ వడ్లపట్లతో చేయడం చాలా గొప్ప అనుభవం. లయన్స్ గేట్ ప్లే ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషం. ఈ సినిమా చివరి వరకు మిమ్మల్ని ఊహించని ట్విస్ట్‌లతో మెస్మరైజ్ చేస్తుంది” అని చెప్పారు.

ఎందుకు చూడాలి ?

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. సాధారణ సీరియల్ కిల్లర్ స్టోరీ కాదు. హత్యలను ఆర్ట్‌గా మార్చడం, సైకలాజికల్ డెప్త్, బలమైన ట్విస్ట్‌లు

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×