Spy Thriller Series: స్పై థ్రిల్లర్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రహస్య మిషన్లు, గూఢచారి ఆపరేషన్లు, దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఏజెంట్ల కథలు ఎప్పుడూ ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేస్తాయి. అలాంటి సిరీస్‌లలో Special Ops: Lioness కూడా ఒకటి. ఇప్పటికే రెండు సీజన్‌లతో భారీ విజయాన్ని అందుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతవదని. ఈసారి కేవలం దేశాన్ని రక్షించే మిషన్ మాత్రమే కాదు… ఒక తల్లి, ఒక భార్య, ఒక సీఐఏ ఏజెంట్‌గా జో జీవితంలో వచ్చే భావోద్వేగ సంఘర్షణ కూడా కథలో కీలకంగా మారింది. మరి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సీఐఏకు చెందిన అత్యంత రహస్య అండర్‌కవర్ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసే ఏజెంట్ జో. ఆమె మరో ప్రమాదకరమైన మిషన్‌కు సిద్ధమవుతుంది. అయితే ఈసారి పరిస్థితులు గతంలో కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అమెరికాకు చెందిన అనేక మంది సీక్రెట్ ఏజెంట్ల వివరాలు, వారి వ్యక్తిగత సమాచారం, ఫోన్ డేటా శత్రువుల చేతికి చేరినట్లు ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అండర్‌కవర్ ఏజెంట్ల ప్రాణాలు ఒక్కసారిగా ప్రమాదంలో పడతాయి.
ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను కనిపెట్టాడానికి జో తన బృందంతో రంగంలోకి దిగుతుంది. కానీ దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఊహించని నిజాలు బయటపడతాయి. ఈ కుట్ర వెనుక ఉన్నవారు కేవలం విదేశీ శత్రువులు మాత్రమే కాదని, వ్యవస్థ లోపలే కొందరు ద్రోహులు కూడా ఉన్నారని ఆమె గ్రహిస్తుంది. అదే సమయంలో జో కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవడంతో ఈ మిషన్ పూర్తిగా వ్యక్తిగత పోరాటంగా మారిపోతుంది.
ఒకవైపు దేశ భద్రత… మరోవైపు తన కుటుంబం. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియని పరిస్థితిలో జో ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు, నమ్మకద్రోహాలు, డబుల్ గేమ్స్ కథను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. అసలు సమాచారం లీక్ చేసింది ఎవరు ? ఆ మాస్టర్‌మైండ్‌ను జో ఎలా కనిపెట్టింది ? తన కుటుంబాన్ని రక్షించగలిగిందా ? దేశంపై ఉన్న ముప్పును అడ్డుకోగలిగిందా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సీజన్ చూడాల్సిందే.
‘స్పెషల్ ఆప్స్ లయనెస్’ సీజన్ 3లో జో సల్దానా, నికోల్ కిడ్మాన్, మోర్గాన్ ఫ్రీమాన్, మైఖేల్ కెల్లీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండనున్న ఈ సీజన్ ఆగస్టు 2 నుంచి Amazon Prime Videoలో వారానికో ఎపిసోడ్ చొప్పున విడుదల కానుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలు, గట్టిగా కట్టిపడేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. Jack Ryan, The Night Agent, The Terminal List లాంటి స్పై థ్రిల్లర్లు మీకు నచ్చితే Special Ops: Lioness Season 3ను అస్సలు మిస్ అవ్వకండి. యాక్షన్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, ఎమోషన్స్, సస్పెన్స్ అన్నీ ఉండే ఈ సీజన్ లో ప్రతి ఎపిసోడ్ లో ఒక ట్విస్టు ఉంటుంది. ఈ ఆగస్టులో స్పై థ్రిల్లర్ అభిమానులు తప్పకుండా చూడాల్సిన సిరీస్‌లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో