Horror Thriller Movie: దెయ్యాల కథలు, శాపాల కథలు చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ ఒక శాపం వందేళ్లు కాదు… ఏకంగా 250 సంవత్సరాలు ఒకే కుటుంబాన్ని వెంటాడితే ఎలా ఉంటుంది ? కాలం మారినా, తరాలు మారినా, ఆ శాపం మాత్రం ఆగకుండా ప్రతి తరం జీవితాలను నాశనం చేస్తూ వస్తే ? ఇలాంటి భయంకరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫిలిప్పీన్స్ హారర్ చిత్రం Shake, Rattle & Roll: Evil Origins. పాపులర్ హారర్ ఫ్రాంచైజ్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమా టైమ్‌లైన్‌ను దాటుకుంటూ సాగే డిఫరెంట్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భయపెట్టే కథతో పాటు కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు మూవీ కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ 1775 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఒక చిన్న గ్రామంలో నివసించే కుటుంబం జీవితంలో అనుకోకుండా జరిగిన ఒక విచిత్ర సంఘటన భవిష్యత్తునే మార్చేస్తుంది. మంత్రవిద్య, నిషేధిత ఆచారాలు, అర్థంకాని అతీంద్రియ శక్తుల కారణంగా ఆ కుటుంబంపై ఒక భయంకరమైన శాపం పడుతుంది. మొదట అది ఒక చిన్న సంఘటనగానే కనిపించినా, కాలం గడిచే కొద్దీ ఆ శాపం అసలు రూపం బయట పడుతుంది.
ఒక్కో తరం మారినప్పుడల్లా ఆ కుటుంబంలో విచిత్రమైన మరణాలు, అర్థంకాని ప్రమాదాలు, భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా ఆ శాపం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా, అది మరింత భయంకరంగా తిరిగి వస్తుంది. కాలం మారుతుంది… నాగరికత మారుతుంది… కానీ ఆ శాపం మాత్రం తన వేటను ఆపదు.
కథ క్రమంగా ఆధునిక కాలానికి చేరుకుంటుంది. చివరకు 2050 సంవత్సరంలో జీవిస్తున్న కొత్త తరం కూడా అదే శాపం బారిన పడుతుంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, సైన్స్ ఎంత ముందుకు వెళ్లినా, కొన్ని శక్తులను అర్థం చేసుకోవడం మనిషికి సాధ్యం కాదని కథ చూపిస్తుంది. అసలు ఆ శాపానికి కారణం ఏమిటి? రెండు వందల యాభై ఏళ్లుగా అది ఎందుకు ఒకే కుటుంబాన్ని వెంటాడుతోంది? దాన్ని ఆపడానికి ఎవరైనా ప్రయత్నించారా? చివరకు ఆ శాపానికి ముగింపు దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్రస్తుతం ఈ హర్రర్ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. పాత కాలం నుంచి భవిష్యత్తు వరకు కథను తీసుకెళ్లిన విధానం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. భయపెట్టే విజువల్స్, డార్క్ వాతావరణం, సౌండ్ డిజైన్, అతీంద్రియ అంశాలు ప్రేక్షకులను కథలో పూర్తిగా ముంచేస్తాయి. ప్రతి టైమ్‌లైన్‌లో కొత్త మిస్టరీని పరిచయం చేస్తూ కథను ఆసక్తికరంగా నడిపించారు. దెయ్యాల కంటే శాపాల కథలు, అతీంద్రియ మిస్టరీలు, ఫ్యామిలీ హారర్ డ్రామాలు ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. 1775 నుంచి 2050 వరకు ఉండే కథ, భయపెట్టే సంఘటనలు, చివరి వరకు కొనసాగే సస్పెన్స్ ఈ చిత్రాన్ని సాధారణ హారర్ మూవీ కంటే భిన్నంగా నిలబెడతాయి. ఈ వీకెండ్‌లో లైట్లు ఆఫ్ చేసి ఒక డిఫరెంట్ హారర్ అనుభూతిని ఆస్వాదించాలనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే. కానీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.
Read Also: డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ