E-Paper
Advertisement

రౌడీ హీరోతో ‘మమ్మీ’ విలన్ ఢీ..మైండ్ బ్లాక్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

రౌడీ హీరోతో ‘మమ్మీ’ విలన్ ఢీ..మైండ్ బ్లాక్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..
Advertisement

Ranabali Firstlook : టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రణబాలి.. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ విలన్ నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి.. ఇప్పుడు తాజాగా ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్న నటుడు ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు.. హాలీవుడ్ ఆల్-టైమ్ క్లాసిక్ ‘ది మమ్మీ’ సిరీస్‌లో ‘ఇమ్‌హోటెప్’ క్యారక్టర్ తో జనాలను మెప్పించిన ఈయన ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈయన ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ ఫస్ట్ లుక్కు పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ఎలా ఉందో ఒకసారి మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

‘రణబాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి వైవిధ్యమైన స్టోరీలను ప్రేక్షకులకు అందించిన రాహుల్ సంకృత్యన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హై-బడ్జెట్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా నుండి ఒక సంచలన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.. ఇందులో హాలీవుడ్ యాక్టర్ ను దించబోతున్నారని సమాచారం. ఆల్-టైమ్ క్లాసిక్ ఫ్రాంచైజ్ ‘ది మమ్మీ’ మూవీలో ఐకానిక్ విలన్ ‘ఇమ్‌హోటెప్’ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్నాల్డ్ వోస్లూ ఈ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టబోతున్నాడు. తాజాగా ఈయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆ పోస్టరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అత్యంత క్రూరమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని పోస్టర్ లో కనిపించబోతున్నారని టాక్.. మరి సినిమాలో ఈయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి..

Advertisement

Also Read :అయ్యో.. విష్ణు పై మళ్ళీ ట్రోల్స్.. ఆ ఒక్కటే అతి పెద్ద మిస్టేక్..?

‘రణబాలి’ సినిమా విషయానికొస్తే..

బాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ జీవితంలోని అత్యంత భారీ బడ్జెట్గా దొరికేకుతున్న చిత్రం రణబాలి.. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అజయ్-అతుల్ అద్భుతమైన అందిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ జనాలని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఈ సినిమా రావడంతో ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది. ఇకపోతే ఈ చిత్రాన్ని రాబోయే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో కీలకమైన అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది.

Advertisement

Related News

‘అబద్ధమేవ జయతే’ పాటను విడుదల చేసిన దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ..

బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి చూడాల్సిన టాప్ తెలుగు సినిమాలు

స్నేహాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు.. ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన 10 సాంగ్స్

‘ఎల్లమ్మ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!

సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

దుమ్ములేపుతున్న’స్పైడర్ మ్యాన్’..రెండు రోజుల్లో వచ్చిందెంతో తెలుసా ?

ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ!

Big Stories

Advertisement
×