E-Paper
Advertisement

విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?

విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?
Advertisement

Psychological Horror Series: స్కూల్ నేపథ్యంలో వచ్చే కథలు అంటే సాధారణంగా స్నేహం, చదువు, ప్రేమ లేదా పోటీ గుర్తొస్తాయి. కానీ అదే పోటీ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తే ఎలా ఉంటుంది ? క్లాస్‌లో ఫస్ట్ రావాలనే కోరిక మనిషిలోని చీకటి కోణాన్ని బయటకు తీస్తే పరిస్థితి ఎలా మారుతుంది ? అలాంటి విభిన్నమైన కథతో రూపొందిన మాండరిన్ సైకలాజికల్ హారర్ సిరీస్ Bloody Smart. మొదట చూస్తే ఇది విద్యార్థుల మధ్య జరిగే సాధారణ పోటీ కథలా అనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటన తర్వాత మొత్తం కథ భయంకరమైన మలుపు తిరుగుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా కథ ముందుకు సాగడంతో హారర్ సిరీస్ అభిమానుల్లో దీనిపై ఆసక్తి పెరుగుతోంది. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎప్పుడూ వెనుకబడే ఓ అబ్బాయి ఉంటాడు. అతన్ని ప్రతి ఒక్కరూ అవమానిస్తారు. చదువులోనూ, ర్యాంకుల్లోనూ అతనికి ఎప్పుడూ చివరి స్థానమే దక్కుతుంది. తన జీవితం ఇంతేనేమో, ఇలాగే సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో అతనికి అనుకోకుండా ఒక విచిత్రమైన పండు దొరుకుతుంది. అది మామూలు పండు కాదని అప్పుడు అతనికి తెలియదు.

Advertisement

ఆ పండు తిన్న తర్వాత అతనిలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించడం మొదలవుతుంది. చదువులో ఒక్కసారిగా అద్భుత ప్రతిభ చూపిస్తూ క్లాస్ టాపర్‌గా మారిపోతాడు. టీచర్లు, స్నేహితులు అందరూ అతనిని చూసి ఆశ్చర్యపోతారు. కానీ అతని తెలివితేటలతో పాటు మరో భయంకరమైన మార్పు కూడా నెమ్మదిగా బయట పడుతుంది. అదే పండు ప్రభావం ఇతర విద్యార్థుల జీవితాలపై కూడా పడుతుంది.

టాప్ ర్యాంక్ కోసం మొదలైన పోటీ క్రమంగా అసూయ, ద్వేషం, క్రూరత్వంగా మారుతుంది. ఒకరిని మించి మరొకరు నిలవాలనే తపనలో విద్యార్థులు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణ స్కూల్ వాతావరణం క్రమంగా భయానకంగా మారిపోతుంది. అసలు ఆ పండు రహస్యం ఏమిటి ? అది ఎందుకు మనుషుల స్వభావాన్ని మార్చేస్తోంది ? టాప్ ర్యాంక్ కోసం విద్యార్థులు ఎంత దూరం వెళ్లారు ? చివరకు ఈ శాపాన్ని ఎవరు ఆపగలిగారు ? అనే ప్రశ్నలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

Advertisement

ప్రస్తుతం ‘బ్లడీ స్మార్ట్’ అనే ఈ హర్రర్ సిరీస్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. స్కూల్ డ్రామాకు సైకలాజికల్ హారర్‌ను జోడించిన తీరు ఈ సిరీస్ ప్రత్యేకతగా నిలుస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే మలుపులు, భయపెట్టే సన్నివేశాలు, విద్యార్థుల మధ్య పెరిగే మానసిక సంఘర్షణ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. హారర్‌తో పాటు సస్పెన్స్‌ను సమపాళ్లలో అందించే విధంగా దర్శకుడు కథను తీర్చిదిద్దారు. సాధారణ దెయ్యాల కథల కంటే మానసిక భయాన్ని కలిగించే సైకలాజికల్ హారర్ సిరీస్‌లు ఇష్టపడేవాళ్ళు దీన్ని ఒకసారి తప్పకుండా చూడాలి. పోటీ, ఆశ, అత్యాశ మనిషిని ఎంత భయంకరంగా మార్చగలవో చూపించే ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆసక్తిని పెంచుతుంది. స్కూల్ నేపథ్యంలో ఇలాంటి డిఫరెంట్ హారర్ కథలు చూడాలనుకుంటే ఈ వీకెండ్‌లో ఈ సిరీస్ ను డోంట్ మిస్. ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ ఒరిజినల్ వెర్షన్ అయిన మాండరిన్ భాషలో మాత్రమే ఉంది.

Read Also : బైక్ రేసర్ ప్రేమలో పడ్డ అంధురాలు.. చివర్లో కంటతడి పెట్టించే కథ

Tags

Related News

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

Big Stories

Advertisement
×