E-Paper
Advertisement

గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్

గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్
Advertisement

Brazilian Thriller Series: యాక్షన్ సిరీస్‌లంటే కేవలం ఫైట్లు మాత్రమే కాదు… బలమైన కథ, మిస్టరీ, ప్రతీకారం కూడా ఉంటేనే చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా హీరో ఎవరో తనకే తెలియని పరిస్థితి నుంచి కథ మొదలై, ఒక్కో ఎపిసోడ్‌లో అతని గతం బయటపడితే ఆ థ్రిల్ మరో స్థాయిలో ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన బ్రెజిలియన్ యాక్షన్ సిరీస్ Wrath ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్షల్ ఆర్ట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, గ్యాంగ్ వార్స్, సస్పెన్స్‌తో నిండిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలోకి లాగేస్తుంది. హీరో అసలు ఎవరు? ఎందుకు చంపాలని చూశారు? అతని గతంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? అనే ప్రశ్నలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఇంతకీ ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక రోజు నగర శివారులోని చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన ఓ వ్యక్తిని కొందరు గుర్తిస్తారు. అతను బతికే ఉంటాడు కానీ తన పేరు, గతం, కుటుంబం… ఏదీ గుర్తుండదు. అతన్ని కాపాడిన వారు అతనికి ఆశ్రయం కల్పించి కోలుకునేలా చూస్తారు. బయటకు చూస్తే సాధారణ మనిషిలా కనిపించినా, అతని ప్రవర్తనలో ఏదో తేడా ఉందని వాళ్ళు గమనిస్తారు.

Advertisement

ఒక సందర్భంలో కొందరు గూండాలు దాడి చేయడంతో అతను అనుకోకుండా తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని బయట పెడతాడు. తనకే గుర్తులేని ఫైటింగ్ స్కిల్స్ చూసి అతనితో పాటు చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. అసలు తాను ఎవరు ? ఇంత ప్రమాదకరమైన శిక్షణ ఎక్కడ తీసుకున్నాడు ? ఎందుకు తనను చంపాలని ప్రయత్నించారు ? అనే ప్రశ్నలు అతన్ని వెంటాడడం మొదలవుతుంది.

తన గతాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్లిన కొద్దీ ఒక్కో రహస్యం బయట పడుతుంది. అతను ఒకప్పుడు అండర్‌గ్రౌండ్ ఫైటర్ మాత్రమే కాదని, ప్రమాదకరమైన మాఫియా నెట్‌వర్క్‌తో అతనికి సంబంధం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో గతంలో తనను మట్టుబెట్టాలని చూసిన శత్రువులు మళ్లీ అతని వెంటపడతారు. అక్కడి నుంచి కథ పూర్తిగా ప్రతీకారం వైపు మళ్లుతుంది. తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్లను అతను ఏం చేశాడు ? తన అసలు గుర్తింపును తిరిగి సంపాదించుకున్నాడా ? మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు ? అనే అంశాల చుట్టూ సిరీస్ సాగుతుంది.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

ప్రస్తుతం ఈ బ్రెజిలీయన్ సిరీస్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రెజిలియన్ యాక్షన్ సినిమాలకు ఉండే రియలిస్టిక్ ఫైట్ కొరియోగ్రఫీ, హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు ఈ సిరీస్‌లోనూ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌లో యాక్షన్‌తో పాటు హీరో గతాన్ని బయటపెట్టే మిస్టరీ కూడా కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వేగవంతమైన స్క్రీన్‌ప్లే, గ్యాంగ్ వార్స్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. మార్షల్ ఆర్ట్స్, రివెంజ్ డ్రామాలు, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సిరీస్‌లు చూడడం ఇష్టమైతే, దీన్ని మిస్ చేసుకోకండి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త మలుపు, భారీ ఫైట్ సీక్వెన్స్‌లు, హీరో గతాన్ని కనుక్కునే ఆసక్తికరమైన ప్రయాణం ఈ సిరీస్‌లో హైలెట్ గా ఉంటాయి. ఈ వీకెండ్‌లో యాక్షన్‌తో నిండిన ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా లేదు.

Read Also: డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

Tags

Related News

విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?

నవ్వుతో చంపే వైరస్… బ్యాట్‌మ్యాన్‌కు జోకర్ షాక్… క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్

దేశం కోసం కుటుంబాన్నే రిస్క్‌లో పెట్టిన మహిళ… సీజన్ 3లో షాకింగ్ ట్విస్టులు

జాంబీలు కాదు ఈసారి అసలు ముప్పు మనుషులే… ‘ది వాకింగ్ డెడ్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

భార్య, గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్… హీరో పడిన కష్టాలు భలే కామెడీ భయ్యా

వజ్రం దొంగతనం కేసులో ఇరుక్కునే పోలీస్… సన్యాసిగా మారి సీక్రెట్ మిషన్

బైక్ రేసర్ ప్రేమలో పడ్డ అంధురాలు.. చివర్లో కంటతడి పెట్టించే కథ

Big Stories

Advertisement
×