OTT Movie : ప్రేమ అనే పదం చాలా చిన్నదే కానీ అది సృష్టించి విధ్వంసం చాలా పెద్దది. ఎందరో జీవితాలను ఈ రెండు అక్షరాలు పై స్థాయికి తీసుకు వెళ్తే, మరికొందరి జీవితాలని నామరూపాలు లేకుండా చేసింది. అటువంటి గొప్పతనం ప్రేమ అనే రెండు అక్షరాలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ మూవీ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘మలై నేరతు మయక్కం‘ (Maalai nerathu mayakkam). 2016లో విడుదలైన ఈ మూవీకి గీతాంజలి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ కోలా, వామిక గబ్బి అనే కొత్త నటులు ఈ మూవీలో నటించారు. దీనిని కోలా భాస్కర్ నిర్మించగా, అమృత్ సంగీతం అందించారు. ఈ మూవీని తెలుగులో ‘నన్ను వదిలి నువ్వు పోలేవులే’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో కాస్త పల్లెటూరి అబ్బాయిగా కనపడుతూ ఉండటంతో, అమ్మాయిలు అతనిని లవ్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు. తనకు ఒక అమ్మాయి కూడా పడలేదని హీరో బాధపడుతుంటాడు. ఇంట్లో వాళ్లకు చెప్పి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ఉద్దేశం తెలుసుకొని, బ్రేకప్ చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత మరొకరిని ఇష్టంగా ప్రేమిస్తుంది. అది కూడా ఫెయిల్యూర్ కావడంతో హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది. ఈ క్రమంలో హీరోకి, హీరోయిన్ తో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒక అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావడంతో హీరో చాలా ఆనందపడతాడు. అయితే మొదటి రాత్రి నుంచి హీరోయిన్, హీరోని దూరం పెడితూ వస్తుంది. చాలా రోజులు వీళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటారు. భార్యను మాత్రం హీరో చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు పెద్దల కోసం మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో భార్యతో ఫిజికల్ గా కలవడానికి ట్రై చేస్తాడు హీరో. అప్పుడు హీరోయిన్ అతనిని దూరంగా నెట్టి, చేయి కట్ చేసుకుంటుంది. తనని హీరో హాస్పిటల్ కి తీసుకువెళ్లి జాయిన్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ చివరగా విడాకులు తీసుకోవాలనుకుంటారు.
హీరోకి విడాకులు తీసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. తనని క్షమించమని ఎన్నిసార్లు అడిగినా హీరోయిన్ విడాకులు కావాలని, లేకపోతే చనిపోతానని హీరోని బెదిరిస్తుంది. హీరోయిన్ ఏమైనా చేసుకుంటుందేమో అని విడాకులు ఇస్తాడు హీరో. ఆ తర్వాత చాలా రోజులకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి టూర్ కి వెళ్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో కూడా ఆ ప్లేస్ కి వెళ్తాడు. హీరో తన వెంట ఒక అమ్మాయిని కూడా తెచ్చుకుంటాడు. ఎందుకంటే హీరోయిన్ జలసీగా ఫీల్ అవ్వాలని అలా చేస్తాడు. ఆ ఫంక్షన్లో వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ, ఎంతగా మిస్ అయ్యామో అని బాధపడుతూ ఉంటారు. అలా ఒకచోట ఇద్దరు కూర్చుని, ఈ సమస్యకు పరిష్కారం నన్ను నువ్వు చంపడమే అంటూ హీరోయిన్ చేతిలో కత్తి పెట్టి పొడిపించుకుంటాడు హీరో. ఈ అనుకోని సంఘటనతో హీరోయిన్ షాక్ అవుతుంది. చివరికి హీరో ఈ ప్రమాదం నుంచి బయటపడతాడా? హీరో, హీరోయిన్ తమ ప్రేమను మళ్లీ పంచుకుంటారా? ఈ విషయాలు తెలియాలంటే ‘మలై నేరతు మయక్కం’ (Maalai nerathu mayakkam) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.