ASia Cup 2025 : సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో వరల్డ్ కప్ ఫైనల్ కి కూడా ఉండని క్రేజ్.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కి ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా వీక్షించేందుకు ఎదురుచూస్తుంటారు. అది వరల్డ్ కప్ అయినా.. ఆసియా కప్ అయినా.. ఛాంపియన్స్ ట్రోఫీ అయినా మ్యాచ్ ఏదైనా కానీ ఆ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో 2025 కి సంబంధించి ఆసియా కప్ షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు జరుగుతుందా..? అనే ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా షెడ్యూల్ రావడంతో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 09వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలో జరుగనుంది.
Also Read : Shubman Gill : పాకిస్తాన్ క్రికెటర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆసియాలోనే తొలి బ్యాటర్ గా
ఆసక్తికరంగా భారత్-పాక్ మ్యాచ్
అయితే భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ టీ-20 ఫార్మాట్ ప్రకారం జరుగనుంది. ఇది ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ కప్ ను భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే నాలుగు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూపు-ఏలో టీమిండియా, పాకిస్తాన్, యూఏఈ, ఓమన్ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. అయితే ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ అప్గనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరుగనుంది. భారత్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో జరుగుతుంది. రెండో మ్యాచ్ సెప్టెంర్ 14న పాకిస్తాన్ తో జరుగనుంది. ఇక మూడో మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్ తో జరుగుతుంది.
ఆసియా కప్ లో ఎనిమిది జట్లు..
ఇక రాబోయే ఆసియా కప్ ఎడిషన్ లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, హాంకాంగ్, ఒమన్, యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. టోర్నమెంట్ లోని ఎనిమిది జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్, యూఏఈ, హాంకాంగ్ గ్రూపు-ఏలో ఉన్నాయి. అప్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ గ్రూపు-బీలో ఉన్నాయి. ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను పేర్కొంటూ.. ఢాకాలో జరిగిన ఏసీసీ సమావేశానికి హాజరు కావడానికి బీసీసీఐ నిరాకరించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యాడు. అయితే ఉద్రిక్తతల కారణంగా ఆగస్టు 2025లో ప్రతిపాదించబడిన భారత్ -బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఆసియా కప్ పై ఆసక్తికరంగా మారింది. టీమిండియా-పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
🚨 THE ASIA CUP 2025 SCHEDULE 🚨#AsiaCup #AsiaCup2025 #AsiaCup2025Schedule pic.twitter.com/tYmvi9CTTN
— CricWorld (@CricWorld099) July 26, 2025