Betting Apps Case.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎంతలా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా.. మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రీతూ చౌదరి (Ritu Chaudhary)పై కూడా కేసు నమోదయింది. అయితే దీనిపై స్పందించిన రీతూ చౌదరి తనకు దీని గురించి ఏమీ తెలియదని, విష్ణు ప్రియ తనను ఈ బెట్టింగ్ యాప్స్ వైపు ప్రోత్సహించిందని, అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాలు తానే తనకు నేర్పించిందని విష్ణుప్రియను అడ్డంగా బుక్ చేయించింది రీతూ చౌదరి.
Tollywood: సినీ నటికి ఘోర అవమానం.. ఎయిర్ పోర్ట్ లో అరుస్తూ అసహనం..!
విచారణకు డుమ్మా కొట్టిన రీతూ చౌదరి..
ఇదిలా ఉండగా మళ్లీ ఒక వీడియో రిలీజ్ చేసిన ఆమె.. తనకు తెలియకుండానే జరిగిపోయిందని, ఇకపై ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అంటూ సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేస్తూ.. తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. రీతూ చౌదరికి ఈరోజు పంజాగుట్ట పోలీసులు విచారణకు రావాలని పిలుపునివ్వగా.. ఆమె డుమ్మా కొట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఒంటిగంట దాటినా విచారణకు రాకపోవడంతో పోలీసులు మరొకసారి ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత గురువారం రీతూ చౌదరితో పాటు విష్ణు ప్రియ(Vishnu Priya ) స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డు చేశారు. మరొకవైపు విష్ణుప్రియ తనపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు అవ్వడంతో ఆ కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం విష్ణుప్రియ విషయంలో పోలీసులు కూడా ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టిన పోలీసులు..
ఇదిలా ఉండగా మరొకవైపు పంజాగుట్ట పోలీసులకు అందుబాటులోకి రాని మరి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది పరారీలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు ఆధారాలను కూడా సేకరించారు. ఇకపోతే బెట్టింగ్ యాప్ యజమానులపై గురిపెట్టిన పంజాగుట్ట పోలీసులు.. ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసిన వీడియోలను కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్..
ఇకపోతే టాలీవుడ్ సినీ పరిశ్రమ నుండి దాదాపు 25 మంది సెలబ్రెటీలపై కేసు నమోదయింది. ముఖ్యంగా రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్, మంచు లక్ష్మీ తో పాటు పలువురు యూట్యూబర్స్ పై కూడా కేసు నమోదైనట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు యూట్యూబర్స్ అరెస్టు అవ్వగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది ఏ క్షణమైనా వీరిని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.