OTT Movie : షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఈ పేరు అందరి నోట్లలో నానుతున్న మాట. సామాన్యులు కూడా వీటిని తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. సినిమాలు తీయలేనివాళ్ళకి ఇది ఒక వేదికగా మారింది. తమ టాలెంట్ ని ఈ షార్ట్ ఫిల్మ్ ల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. కంటెంట్ బాగుంటే వీటికి అవార్డులు కూడా వరిస్తున్నాయి. ఎన్నో షార్ట్ ఫిల్మ్ లకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్, భర్తతో విసిగిపోయిన ఒక భార్య మానసిక వేదన చుట్టూ తిరుగుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కెనెడా నుంచి వచ్చింది. ఈ స్టోరీ ఉన్నది కాసేపే అయినా లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
యూట్యూబ్ (youtube) లో
ఈ కెనెడియన్ హారర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘మేక్ మి ఏ శాండ్ విచ్’ (Make Me a Sandwich). 2019 లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కు డెన్‌మాన్ హాచ్, మాట్ హామిల్టన్ దర్శకత్వం వహించారు. ఇందులో అన్నే షెపర్డ్, పీటర్ హాడ్జిన్స్ నటించారు. ఈ కథ మార్సీ, ఆమె భర్త జాన్సన్ అనే వృద్ధ దంపతుల చుట్టూ తిరుగుతుంది. వీరు ఒక అస్తవ్యస్తమైన జీవన వాతావరణంలో జీవిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒక భ్రమలో ఈ వృద్ధ దంపతులు బ్రతుకుతుంటారు. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జాన్సన్ అనే భర్త ఏ పని పాటా లేకుండా, నిరంతరం టీవీ చూస్తూ కూర్చుని ఉంటాడు. తన భార్య మార్సీని నాకు శాండ్‌విచ్ చేయి అని నిరంతరం ఆదేశిస్తుంటాడు. అతని ఈ నిరంతర డిమాండ్లు, మాట్లాడే పద్దతి, ఎప్పుడూ టివి చూడటం మార్సీని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. అయినా సరే, ఆమె తన భర్త ఆదేశాలను పాటిస్తూ శాండ్‌విచ్‌లు తయారు చేస్తుంది. కానీ క్రమంగా ఆమెలో భర్త మీద తీవ్రమైన అసహనం పెరుగుతుంది. ఒక దశలో మార్సీ తన నిరాశను వెలిబుచ్చడానికి శాండ్‌విచ్‌లలో సబ్బు, మలం, విరిగిన గాజు వంటి వస్తువులను కలపడం ప్రారంభిస్తుంది. ఆశ్చర్యకరంగా, జాన్సన్ ఈ విషపూరిత శాండ్‌విచ్‌లను ఎటువంటి ప్రతిస్పందన లేకుండా తింటాడు. ఇదంతా చూసి మార్సీ ఆశ్చర్యపోతుంది. చివరి ట్విస్ట్‌లో, జాన్సన్ అప్పటికే చనిపోయి ఉన్నాడని, అతని శరీరం కుళ్ళిపోతున్న స్థితిలో ఉందని తెలుస్తుంది. మార్సీ తన భర్త చనిపోయినప్పటికీ, అతని ఆదేశాలు ఆమె మనస్సులో ఇంకా గట్టిగా నాటుకుపోయి ఉండటం వల్ల, ఆమె శాండ్‌విచ్‌లు చేయడం కొనసాగిస్తూ ఉంటుంది. అతని భర్త కూడా బ్రతికే ఉన్నాడనే భ్రమలో ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ దీర్ఘకాలిక మానసిక మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందడం ఎంత కష్టమో చూపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ, దాని భావోద్వేగ లోతు, షాకింగ్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.