Mandaadi OTT Release : విలన్‌గా సుహాస్… హీరోగా సూరి… సముద్రం మధ్యలో ప్రాణాలకు తెగించి పడవల పందెం… గెలవాలంటే స్పీడ్ మాత్రమే ఉంటే సరిపోదు. సముద్రం గురించి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. పోటీ ఎంత ప్రమాదకరంగా మారినా టీమ్ ను గెలిపించాల్సిందే. ఇలాంటి సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన తమిళ యాక్షన్ డ్రామానే ‘Mandaadi’. థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా సూరి, సుహాస్ కలిసి కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మరి సినిమా అసలు కథ ఏంటి ? సముద్రంలో జరిగే ఈ పడవల రేస్ వెనుక ఉన్న గొడవ ఏంటి ? ఈ మోస్ట్ అవైటింగ్ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? చూద్దాం పదండి.
కథ మొత్తం సముద్రం, చేపల వేట, అక్కడి ప్రజల జీవన విధానం చుట్టూనే తిరుగుతుంది. సూరి ఇందులో ఒక అనుభవజ్ఞుడైన ఫిషింగ్ కెప్టెన్ పాత్రలో కనిపిస్తారు. సముద్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న అతడికి నీటి ప్రవాహాలు, అలల స్వభావం, వాతావరణం, పడవను ఎలా నడపాలి అనే విషయాల్లో మంచి పట్టుంటుంది. అయితే అతడు సంప్రదాయంగా జరిగే ఓ భారీ పడవల రేసులో తన ఆరుగురు సభ్యుల టీమ్ ను గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేదో అల్లాటప్పా పడవల పోటీ కాదు. వేర్వేరు టీమ్ లు తమ ప్రాంతం తరఫున పోటీకి దిగుతాయి. ప్రతి టీమ్‌కు గెలవాలనే పట్టుదల ఉంటుంది. సముద్రంలో చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ప్రమాదం.
ఇక ప్రత్యర్థి టీమ్‌లలో సుహాస్ పాత్ర కీలకంగా మారుతుంది. పోటీ పెరిగే కొద్దీ వ్యక్తిగత గొడవలు, పాత విభేదాలు, ఆధిపత్య పోరు కూడా బయటకు వస్తుంటాయి. అందుకే ఈ రేస్ కేవలం ట్రోఫీ కోసం జరిగేది కాదు. గెలుపు వెనుక గౌరవం, ప్రతిష్ఠ, ప్రాంతీయ ఆధిపత్యం లాంటి అంశాలు కూడా ఉంటాయి. సూరి పాత్ర తన టీమ్ ను ఒక్కటిగా ఉంచుతూ… సముద్రం తనకు నేర్పిన అనుభవంతో పోటీని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. అలలు ఎంత బలంగా ఉన్నా, ప్రత్యర్థులు ఎంత డేంజరస్ గా ఉన్నా వెనక్కి తగ్గకూడదనే పట్టుదల అతడిలో ఉంటుంది.
ఈ మూవీకి సముద్రపు వాతావరణం, పడవల రేస్, గ్రామీణ జీవన విధానం ప్రధాన బలం. సూరి యాక్షన్ ఇమేజ్‌తో పాటు సుహాస్ పాత్రలో కనిపించే నెగెటివ్ షేడ్స్ కూడా సినిమాకు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా సముద్రం మధ్యలో జరిగే పోటీ సీన్స్ సినిమాకు మాస్ ఫీలింగ్ ఇస్తాయి. మరి అసలు హీరో, విలన్ల మధ్య ఉన్న శతృత్వానికి కారణం ఏంటి ? చివరికి ఈ రేసులో గెలిచింది ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
Also Read : ఫ్యూచరిస్టిక్ కాలనీలో ఫేక్ బతుకులు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… స్ట్రీమింగ్ తెలుగులోనే
‘మందాడి’కి Mathimaran Pugazhendhi దర్శకత్వం వహించారు. Soori, Suhas, Mahima Nambiar, Ravindra Vijay, Mithun Jai Sankar, Bala Saravanan తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026లో థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సెన్సేషనల్ మూవీ తాజాగా Netflixలోకి వచ్చింది. ఓటీటీలో ప్రస్తుతం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలతో ఈ సినిమా అందుబాటులో ఉంది.