BigTV English

Alastair Cook: వివాదంగా “కంకషన్ సబ్‌స్టిట్యూట్‌”.. రాణా బౌలింగ్ చేయడం కుట్రనే ?

Alastair Cook: వివాదంగా “కంకషన్ సబ్‌స్టిట్యూట్‌”.. రాణా బౌలింగ్ చేయడం కుట్రనే ?

Alastair Cook on Harshit Rana: ఐదు టి-20ల సిరీస్ లో భాగంగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగవ టి-20 లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. వెంటవెంటనే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా { Hardik Pandya} మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు.


Also Read: Ind vs Eng, 4th T20I: సిరీస్ గెలిచిన టీమిండియా… హర్షిత్ బౌలింగ్ పై గంభీర్ రియాక్షన్ అదుర్స్!

శివమ్ దూబే { Shivam Dube} కూడా 34 బంతులలో 53 పరుగులతో విరుచుకుపడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో దూబే కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో రాణించిన దూబేకి.. ఆఖరి ఓవర్ లో జెమి ఓవర్టన్ {Jami overton} వేసిన బౌన్సర్ హెల్మెట్ కి బలంగా తాకింది. దీంతో ఫిజియోలు వెంటనే గ్రౌండ్ లోకి పరిగెత్తుకొచ్చి కంకషన్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన శివమ్ దూబే.. చివరి బంతికి రన్ అవుట్ అయ్యాడు.


అయితే రూల్స్ ప్రకారం కంకషన్ సబిస్టిట్యూడ్ ఆడించే అవకాశం ఉండడంతో టీమిండియా తెలివిగా వ్యవహరించి హర్షిత్ రాణా { Harshit Rana} ని బరిలోకి దించింది. ఇక హర్షిత్ రాణాకి కూడా ఇదే తొలి అంతర్జాతీయ టి-20 మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ రానా తన అద్భుత బౌలింగ్ తో మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ కి ముందు తుదిజట్టులో లేని రానా.. శివమ్ దూబే స్థానంలో సబిస్టిట్యూడ్ ప్లేయర్ గా వచ్చి బౌలింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ మ్యాచ్ లో రానా మూడు వికెట్లను పడగొట్టడమే కాదు.. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ ని అద్భుతంగా అందుకున్నాడు. దూబే స్థానంలో రాణా సబిస్టిట్యూడ్ ఫీల్డర్ గా బరిలోకి దిగాడేమోనని అంతా అనుకున్నారు. కానీ అతడు బౌలింగ్ చేయడానికి సిద్ధం కావడంతో షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ లో రాణా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే దూబే స్థానంలో హర్షిత్ ని కంకషన్ సబిస్టిట్యూడ్ గా తీసుకోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మైదానంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫీల్డ్ అంపైర్లతో చర్చించినప్పటికీ ఫలితం భారత్ కి అనుకూలంగా వచ్చింది. మ్యాచ్ అనంతరం బట్లర్ స్పందిస్తూ.. ” ఈ రీప్లేస్మెంట్ సరైంది కాదు. మేము దీంతో ఏకీభవించడం లేదు. మమ్మల్ని సంప్రదించలేదు. నేను బ్యాటింగ్ కి దిగేటప్పుడు హర్షిత్ ఎందుకు..? అని అడిగాను. కంకషన్ సబ్స్టిట్యూడ్ అని చెప్పారు. దీనిపై మ్యాచ్ రెఫరీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనిపై జవగళ్ శ్రీనాథ్ ను స్పష్టత ఇవ్వాలని అడుగుతాం” అన్నారు బట్లర్.

అయితే దూబే స్థానంలో ఓ బౌలర్ ని ఎలా తీసుకుంటారని సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కెవిన్ పీటర్సన్, నిక్ నైట్ కూడా ఈ నిర్ణయం పై ప్రశ్నలు సంధించారు. ఇక హర్షిత్ రానా అని తీసుకోవడంపై మాజీ కెప్టెన్ అలిష్టర్ కుక్ బహిరంగంగానే ప్రశ్నలు సంధించారు. ఇంగ్లాండ్ ఓటమికి కారణం దూబే స్థానంలో హర్షిత్ ని తీసుకురావడమేనని అన్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం కంకషన్ సబిస్టిట్యూడ్ ల ఎంపిక లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ లుగా ఉండాలన్నాడు. ఈ నిర్ణయంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నాడు. దీనికి అనుమతి ఇవ్వడం పూర్తి పిచ్చి పనిగా కనిపిస్తుందన్నాడు. దూబే పార్టైం బౌలింగ్ చేసే బ్యాటర్ అని, అతడి స్థానంలో భారీ సీమ్ బౌలర్ ని ఎలా తీసుకువస్తారని ప్రశ్నించాడు.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే పాకిస్థాన్ టీం ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?

అయితే కంకషన్ సబిస్టిట్యూడ్ ప్రోటోకాల్ ప్రకారం ఒకరికి బదులు మరొకరు ఆడేందుకు అనుమతి ఇవ్వొచ్చు. కానీ బ్యాటర్ స్థానంలో బ్యాటర్, లేదా బౌలర్ స్థానంలో బౌలర్, లేదా ఆల్ రౌండర్ స్థానంలో ఆల్ రౌండర్ కి అవకాశం ఉంటుంది. ఏదైనా జట్టు విజ్ఞప్తి మేరకు ఐసిసి రిఫరీ అనుమతి ఇవ్వాలి. అతడిదే తుది నిర్ణయం. ఈ నిర్ణయంపై ప్రత్యర్థి జట్టుకు అప్పీల్ చేసేందుకు హక్కు ఉండదు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×