Mario on OTT : సినీ ఇండస్ట్రీలో హెబ్బా పటేల్ దశాబ్ద కాలంగా హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. అయితే అనుకున్నంత జోరు మాత్రం కనిపించట్లేదు. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా సాధించలేదు. ఆమె వరుసగా తక్కువ బడ్జెట్ ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. అయినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘మారియో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఎప్పటి నుంచో హిట్ కోసం తపించిపోతున్న ఈ అమ్మడు ఆశ మీద నీళ్ళు చల్లినట్లు అయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో కొంత మేర ఆకట్టుకునే అవకాశం ఉందని మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఇది వాళ్ళ అంచనాలను ఓటీటీలో అందుకుంటుందా ? ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
2025 డిసెంబర్ 20న థియేటర్లలో అడుగుపెట్టిన ‘మారియో’ (Mario) సినిమా డిజిటల్ హక్కులను ఆహా ఓటీటీ పొందింది. 2026 జనవరి 23 నుండి దీనిని ఆహా ఓటీటీ ప్రసారం చేయనుంది. కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కొత్త లుక్ లో కనిపించారు. మారియో సినిమా కోసం ఆమె బరువు కూడా బాగా తగ్గి న్యూ లుక్ లో కనిపించింది. ఇక ఇటీవల, థియేటర్లలో ఆడని కొన్ని తెలుగు సినిమాలు ఓటీటీలో విజయం సాధించాయి. అలాంటి వాటిలో రోషన్ కనకా ల నటించిన మోగ్లీ కూడా ఒకటి. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మోగ్లీ థియేటర్లలో బోల్తా కొట్టినా, ఇప్పుడు ఓటీటీలో మంచి వ్యూస్ సాధించింది. మారియో కూడా ఇదే బాటలో నడుస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
బాబ్ మార్లే (రాకేందు మౌళి) అనే ఒక డ్రగ్ లార్డ్ ఒక వింతైన డ్రగ్‌ను కనిపెడతాడు.ఈ డ్రగ్ తీసుకున్న వారికి మద్యం, జూదం, శృంగారం వంటి వ్యసనాలపై కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. బాబ్ మార్లే ఈ డ్రగ్‌ను నగరమంతా వ్యాపింపజేయడానికి హెబ్బా (హెబ్బా పటేల్) ను వాడుకుంటాడు. ఆమెకు తెలియకుండానే ఆ డ్రగ్‌ను ఇంజెక్ట్ చేసి, ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేయిస్తాడు.
ఈ సమస్యల్లో అనిరుధ్ (అనిరుధ్ శ్రీవాత్సవ్) అనే యువకుడు అనుకోకుండా చిక్కుకుంటాడు. అనిరుధ్ తన వింటేజ్ కారు ‘మారియో’ సహాయంతో హెబ్బాను ఈ మాఫియా నుండి కాపాడటానికి ప్రయత్నిస్తాడు. చివరికి డ్రగ్స్ వల్ల వచ్చే వింతైన సైడ్ ఎఫెక్ట్స్ నుండి హెబ్బా ఎలా బయటపడింది? అనిరుధ్ ఆ డ్రగ్ మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? అనే మలుపులతో సినిమా క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా సాగుతుంది.
Read Also : 22 అవార్డులను గెలుచుకున్న 2 గంటల 20 నిమిషాల యాక్షన్ డ్రామా… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్