Telugu TV Serials : తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిలిపాది ఆ సీరియల్స్ ని తిలకించేలా అద్భుతంగా స్టోరీ తో ప్రసారమవుతున్నాయి. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే.. ఒక్కొక్కటి ప్రత్యేకమైన స్టోరీ తో వస్తున్నాయి..స్టార్ మా లో ప్రతి సీరియల్ కూడా గట్టి పోటీతో టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు వెనకడుగు వేసిన సీరియల్స్ సైతం ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. ఈవారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన స్టార్ మా సీరియల్స్ ఏవో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
కార్తీక దీపం 2..
తెలుగు టీవీ సీరియల్స్ రీసెంట్ హిస్టరీ చూస్తే నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘కార్తీక దీపం 2’ అత్యంత వీక్షకాదరణతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసింది. రెండు వారాల క్రితం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం. దీని రేటింగ్ విషయానికొస్తే.. 14.88 రేటింగ్ తో దూసుపోతుంది..
ఇల్లు ఇల్లాలు పిల్లలు..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ మరో సూపర్ హిట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. కూతురు గొప్పగా బ్రతకాలనీ ఓ తల్లి మోసం చేసి పెళ్లి చేస్తుంది. ఆ కోడలు వల్ల కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులను చూపించారు. ఈ సీరియల్ ఈ మధ్య ఏం మొదలైన కూడా రేటింగ్ లో మాత్రం దూసుకుపోతుంది. కార్తీకదీపం తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 13.58 రేటింగ్ నమోదైంది.
గుండెనిండా గుడిగంటలు..
స్టార్ మాలో సక్సెస్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు. మధ్యతరగతి కుటుంబంలో కష్టం నమ్ముకొనే మనుషులు, రిచ్ గా ప్రవర్తించే మనుషులు.. కోడలును ఆడిపోసుకొనే అత్త. ఎంతో చక్కని స్టోరీతో సీరియల్ కొనసాగుతుంది. ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. గతంలో వెనకబడ్డ ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ 3 లో కొనసాగుతుంది.. గుండెనిండా గుడి గంటలు సీరియల్ 13.19 రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్‌లో ఉంటే ఫస్ట్ లేదంటే సెకండ్ అన్నట్టుగా ఉంది.
ఇంటింటి రామాయణం..
స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో మూడో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 13.6 రేటింగ్ వచ్చింది.
Also Read: ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?
గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఇప్పుడు దారుణంగా పడిపోయింది. రాజు గతం మర్చిపోవడంతో ఈ సీరియల్ ని ఎక్కువగా జనాలు ఇష్టపడటం లేదు. దాంతో టిఆర్పి రేటింగ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. నువ్వుంటే నా జతగా సీరియల్ 8.90 రేటింగ్ సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఇక చిన్ని సీరియల్ 8.79 రేటింగ్ సాధించి ఆరో స్థానంలో నిలిచింది. కొత్తగా ప్రారంభం అయిన ‘నిండు మనసులు’ సీరియల్‌కి 5.17 రేటింగ్ వచ్చింది.. చూస్తుంటే ఈ సీరియల్ నెక్స్ట్ వీక్ టాప్ రేటింగ్ లో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి..