Star Actor : ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూ వచ్చిన కేన్స్ ఫెస్టివల్ ఎప్పుడు అందాల ముద్దుగుమ్మాలతో సందడిగా ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం వివాదాలకు కేరాఫ్ గా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేన్స్ లో రెడ్ కార్పెట్ పై అందాల తారలు అందాల ప్రదర్శన చేశారు. చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ పై విమర్శలు, వివాదాలు ఎదురవుతున్నాయి. కొందరు మోడల్స్ బట్టలు విప్పేసి, ఇంకొందరు చిరిగిన దుస్తులతో కనిపించి షాక్ ఇచ్చారు. ఈ కోవలోనే భారతీయ నటి ప్రదర్శించిన ఫ్యాషన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోదీ ఫోటోలను పెట్టుకొని ఒక విచిత్రమైన నెక్లేస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కొంతమంది మాత్రం దీన్ని తప్పు అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
కేన్స్ ఫెస్టివల్ లో మోదీ..
కేన్స్ రెడ్ కార్పెట్‌పై అందాల ముద్దుగుమ్మలు తమ విచిత్రమైన డ్రస్సులతో ప్రదర్శనలు చేశారు. బాలీవుడ్ టాలీవుడ్ లోనే కొందరు హీరోయిన్లు అదరగొట్టారు. అందమైన డ్రస్సులతో కనువిప్పు చేశారు. అని బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ మాత్రం విమర్శలు అందుకుంటుంది. అందుకు కారణం ఆమె మెడలో ధరించిన నెక్లేస్.. అదేంటి నెక్లెస్ కూడా వేసుకోకూడదా అనే సందేహం వస్తుంది కదూ.. కానీ ఆమె వేసుకుని నెక్లెస్ బాగానే ఉంది ఆ నెక్లెస్ కి చివరన మోడీ ఫోటోలు కూడా ఉండడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు ఉండటం, అవి ఆమె వక్షోజాలపైకి వచ్చేలా ధరించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఏదో అందాలపై అలా మోడీ ఫోటోలు ఉండడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెటిజెన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా స్పందిస్తూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: మొన్న బాబాయ్ తో.. నేడు అబ్బాయితో.. కీలక రోల్ లో హీరోయిన్..
వివాదాలకు కేరాఫ్ గా మారుతున్న మోడల్స్..
మోడల్స్ తమ అందమైన శరీరాకృతిని మరింత అందంగా మార్చే డ్రస్సులతో ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పోటీపడి మాత్రమే విచిత్ర డ్రస్సుల తో ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. కొందరు సెలబ్రిటీలు, మోడల్స్ ఫ్యాషన్ పేరిట హద్దులు మీరి అంగాంగ ప్రదర్శనలకు పాల్పడటం, అసభ్యకరమైన ప్రవర్తన కనబరచడం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇది కేన్స్ ఫెస్టివల్ స్థాయిని, గౌరవాన్ని దిగజారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.. లైన్ లైట్లోకి వచ్చేందుకు సెలబ్రిటీలు డ్రెస్సులతో విచిత్రమైన వేషధారణతో ఆకట్టుకోవాలి కానీ ఇలా అడ్డదారులు తొక్కితే చండాలంగా ఉంటుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికైతే ఈసారి జరిగిన కేన్స్ ఫెస్టివల్ వివాదాల తో ముగిసింది. తెలుగు హీరోయిన్లు విచిత్రమైన డ్రెస్ లతో ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.